Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Leviticus Chapters

Leviticus 3 Verses

Bible Versions

Books

Leviticus Chapters

Leviticus 3 Verses

1 అతడు అర్పించునది సమాధానబలియైనయెడల అతడు గోవులలోనిది తీసికొని వచ్చినయెడల అది మగదేగాని ఆడుదేగాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసికొనిరావలెను.
2 తాను అర్పించు దాని తలమీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజ కులగు అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
3 అతడు ఆ సమాధాన బలి పశువుయొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును ఆంత్ర ములమీది క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంధులను వాటిమీదను
4 డొక్కలమీదనున్న క్రొవ్వును కాలే జముమీదను మూత్రగ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింవలెను.
5 అహరోను కుమారులు బలిపీఠముమీద, అనగా అగ్నిమీది కట్టె లపైనున్న దహనబలి ద్రవ్యముపైని దానిని దహింప వలెను. అది యెహోవాకు ఇంపైన సువాసనగలహోమము.
6 యెహోవాకు సమాధానబలిగా ఒకడు అర్పించునది గొఱ్ఱ మేకలలోనిదైనయెడల అది మగదేగాని ఆడుదేగాని నిర్దోషమైనదాని తీసికొని రావలెను.
7 అతడర్పించు అర్ప ణము గొఱ్ఱపిల్లయైన యెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను.
8 తాను అర్పించు దాని తలమీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
9 ఆ సమాధాన బలి పశువుయొక్క క్రొవ్వును ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని ఆంత్రములలోని క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని
10 రెండు మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కల పైనున్న క్రొవ్వును మూత్ర గ్రంథులమీది కాలేజముయొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను.
11 యాజకుడు బలి పీఠముమీద దానిని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము.
12 అతడు అర్పించునది మేక యైనయెడల యెహోవా సన్నిధికి దానిని తీసికొని రావలెను.
13 తాను దాని తలమీద చెయ్యి ఉంచి ప్రత్య క్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠముచుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.
14 తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును ఆంత్రములమీది క్రొవ్వు అంతటిని
15 రెండు మూత్ర గ్రంథులను వాటిమీది డొక్కలపైనున్న క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులపైనున్న కాలేజముయొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను.
16 యాజకుడు బలిపీఠముమీద వాటిని దహింప వలెను. క్రొవ్వంతయు యెహోవాదే; అది సువాసనగల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు.
17 అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలోను నిత్యమైన కట్టడ.

Leviticus 3:17 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×