Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Leviticus Chapters

Leviticus 20 Verses

Bible Versions

Books

Leviticus Chapters

Leviticus 20 Verses

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెనునీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము
2 ఇశ్రా యేలీయులలోనేగాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనేగాని యొకడు ఏమాత్రమును తన సంతాన మును మోలెకుకు ఇచ్చినయెడల వానికి మరణ శిక్ష విధింప వలెను; మీ దేశప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను.
3 ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజ లలోనుండి వాని కొట్టివేతును.
4 మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక,
5 చూచి చూడనట్లు తమ కన్నులు మూసికొనినయెడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారముచేయు వారినందరిని ప్రజలలోనుండి కొట్టివేతును.
6 మరియు కర్ణపిశాచి గలవారితోను సోదె గాండ్ర తోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువా డెవడో నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టి వేతును.
7 కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి; నేను మీ దేవుడనైన యెహో వాను.
8 మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింప వలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను
9 ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.
10 పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.
11 తన తండ్రి భార్యతో శయ నించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదనమునుతీసెను; వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.
12 ఒకడు తన కోడలితో శయనించినయెడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి; వారి ప్రాణాపరాధము వారిమీదనుండును.
13 ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన యెడల వారిద్దరు హేయక్రియనుచేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.
14 ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లిచేసికొనినయెడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామప్రవర్తన మీ మధ్య నుండ కుండ వానిని వారిని అగ్నితో కాల్చవలెను.
15 జంతుశయ నము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.
16 స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమశిక్షకు తామే కారకులు.
17 ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనే గాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును వాని దిసమొలను ఆమెయు చూచిన యెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానా చ్ఛాదనమును తీసెను; తన దోష శిక్షను తాను భరించును.
18 కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదన మును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్త ధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజ లలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.
19 నీ తల్లి సహో దరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానా చ్ఛాదన మునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్త సంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.
20 పినతల్లితోనేగాని పెత్తల్లితోనే గాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరించెదరు; సంతానహీనులై మరణమగుదురు.
21 ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము. వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులై యుందురు.
22 కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధు లన్నిటిని అనుసరించి నడుచు కొనవలెను.
23 నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.
24 నేను మీతో చెప్పిన మాట యిదేమీరు వారి భూమిని స్వాస్థ్య ముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవ హించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలోనుండి మిమ్మును వేరుపర చిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
25 కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన యే జంతువువల ననేగాని, యే పక్షివలననేగాని, నేల మీద ప్రాకు దేనివల ననేగాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు.
26 మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్య జనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.
27 పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణ శిక్ష విధింప వలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.

Leviticus 20:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×