Indian Language Bible Word Collections
Job 13:6
Job Chapters
Job 13 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Assamese
Books
Old Testament
New Testament
Job Chapters
Job 13 Verses
1
|
ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను.నా చెవి దాని విని గ్రహించియున్నది |
2
|
మీకు తెలిసినది నాకును తెలిసేయున్నదినేను మీకంటె తక్కువ జ్ఞానముగలవాడను కాను. |
3
|
నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడ గోరుచున్నానుదేవునితోనే వాదింప గోరుచున్నాను |
4
|
మీరైతే అబద్ధములు కల్పించువారు.మీరందరు పనికిమాలిన వైద్యులు. |
5
|
మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును. |
6
|
దయచేసి నా వాదము వినుడి, నేను ఆడు వ్యాజ్యెమునాలకించుడి. |
7
|
దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదనచేయుదురా?ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా? |
8
|
ఆయనయెడల మీరు పక్షపాతము చూపుదురా?దేవుని పక్షమున మీరు వాదింతురా? |
9
|
ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా?లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరుఆయనను మోసముచేయుదురా? |
10
|
మీరు రహస్యముగా పక్షపాతము చూపినయెడలనిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించును. |
11
|
ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా?ఆయన భయము మీ మీదికి రాదా? |
12
|
మీ హెచ్చరిక మాటలు బూడిదె సామెతలు.మీ వాదములు మంటివాదములు |
13
|
నేను మాటలాడెదను నా జోలికి రాక మౌనులైయుండుడినామీదికి వచ్చునది ఏదో అది వచ్చునుగాక. |
14
|
నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసికొనవలెను?చేసికొననుగాని ప్రాణమునకు తెగించి మాటలాడెదను |
15
|
ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను.ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును. |
16
|
ఇదియు నాకు రక్షణార్థమైనదగునుభక్తిహీనుడు ఆయన సన్నిధికి రాతెగింపడు. |
17
|
నా వాజ్మూలమును శ్రద్ధగా ఆలకించుడినా ప్రమాణవాక్యములు మీ చెవులలో చొరనీయుడి. |
18
|
ఆలోచించుడి నేను నా వ్యాజ్యెమును సరిచేసికొనియున్నానునేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియును. |
19
|
నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు?ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొనిప్రాణము విడిచెదను. |
20
|
ఈ రెండు పనులు మాత్రము నాకు చేయకుము అప్పుడు నేను నీకు విముఖుడనై యుండను. |
21
|
నీ చెయ్యి నామీదనుండి తొలగింపుమునీ భయము నన్ను బెదరింపనీయకుము |
22
|
అప్పుడు నీవు పిలిచిన యెడల నేను నీ కుత్తర మిచ్చెదను నేను పలికెదను నీవు నా కుత్తరమిమ్ము |
23
|
నా దోషములెన్ని? నా పాపములెన్ని?నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము. |
24
|
నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి?నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు? |
25
|
ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవువేధించెదవా?ఎండిపోయిన చెత్తను తరుముదువా? |
26
|
నీవు నాకు కఠినమైన శిక్ష విధించి యున్నావునా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగానీవు విధించియున్నావు |
27
|
బొండలలో నా కాళ్లు బిగించియున్నావునా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావునా అరికాళ్లచుట్టు గిఱిగీసియున్నావు |
28
|
మురిగి క్షీణించుచున్న వానిచుట్టుచిమ్మటకొట్టిన వస్త్రమువంటివానిచుట్టుగిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు. |