1
|
బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి |
2
|
యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితోకూడ వచ్చిన ఇశ్రాయేలీయులయొక్క లెక్కయిది. |
3
|
పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు, |
4
|
షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు, |
5
|
ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు, |
6
|
పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు, |
7
|
ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు, |
8
|
జత్తూ వంశస్థులు తొమి్మదివందల నలువది యయిదుగురు, |
9
|
జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మంది, |
10
|
బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు, |
11
|
బేబైవంశస్థులు ఆరువందల ఇరువది ముగ్గురు, |
12
|
అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు, |
13
|
అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు, |
14
|
బిగ్వయి వంశస్థులు రెండు వేల ఏబది ఆరుగురు; |
15
|
ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు, |
16
|
అటేరు వంశస్థులు హిజ్కియాతోకూడ తొంబది ఎనమండుగురు, |
17
|
బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు, |
18
|
యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు, |
19
|
హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు, |
20
|
గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు, |
21
|
బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు, |
22
|
నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు, |
23
|
అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు, |
24
|
అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు, |
25
|
కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు, |
26
|
రామాగెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువది యొక్కరు, |
27
|
మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు, |
28
|
బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు, |
29
|
నెబో వంశస్థులు ఏబది ఇద్దరు, |
30
|
మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు, |
31
|
ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు, |
32
|
హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది, |
33
|
లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు, |
34
|
యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు, |
35
|
సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది, |
36
|
యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల ఏబది ముగ్గురు |
37
|
ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు, |
38
|
పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు, |
39
|
హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు, |
40
|
లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు, |
41
|
గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు, |
42
|
ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు, |
43
|
నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు, |
44
|
కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశ స్థులు, |
45
|
లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, |
46
|
హాగాబు వంశస్థులు, షల్మయి వంశ స్థులు, హానాను వంశస్థులు, |
47
|
గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు, |
48
|
రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, |
49
|
ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, |
50
|
అస్నా వంశ స్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు, |
51
|
బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, |
52
|
బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, |
53
|
బర్కోసు వంశస్థులు, సీసెరా వంశ స్థులు, తెమహు వంశస్థులు, |
54
|
నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, |
55
|
సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, |
56
|
యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, |
57
|
షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు, |
58
|
నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థు లును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు. |
59
|
మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింప లేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను. |
60
|
వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు. |
61
|
మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయు డైన బర్జిల్లయియొక్క కుమార్తెలలో ఒక తెను పెండ్లిచేసికొని వారి పేళ్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడినవాని వంశస్థులు. |
62
|
వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. |
63
|
మరియు పారసీకుల అధికారిఊరీమును తుమీ్మ మును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను. |
64
|
సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను. |
65
|
వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడు వేల మూడువందల ముప్పది యేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి. |
66
|
వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు, |
67
|
వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను. |
68
|
కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. |
69
|
పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారు వేల మూడువందల తులముల బంగారమును రెండు లక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి. |
70
|
యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీ యులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి. |
Ezra 2:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...