1
|
ముప్పదియవ సంవత్సరము నాలుగవ నెల అయిదవ దినమున నేను కెబారు నదీప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని; ఆ కాలమున ఆకాశము తెరవ బడగా దేవునిగూర్చిన దర్శనములు నాకు కలిగెను. |
2
|
యెహోయాకీను చెరపట్టబడిన అయిదవ సంవత్సరము ఆ నెలలో అయిదవ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును |
3
|
యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షముకాగా అక్కడనే యెహోవా హస్తము అతనిమీదికి వచ్చెను. |
4
|
నేను చూడగా ఉత్తర దిక్కునుండి తుపాను వచ్చు చుండెను; మరియు గొప్ప మేఘమును గోళమువలె గుండ్ర ముగా ఉన్న అగ్నియు కనబడెను, కాంతిదానిచుట్టు ఆవరించియుండెను; ఆ అగ్నిలోనుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న యపరంజివంటి దొకటి కనబడెను. |
5
|
దానిలోనుండి నాలుగు జీవుల రూపములుగల యొకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది. |
6
|
ఒక్కొక్క దానికి నాలుగు ముఖములును నాలుగు రెక్క లును గలవు. |
7
|
వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్లు పెయ్యకాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను. |
8
|
వాటి నాలుగు ప్రక్కలరెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను, నాలు గింటికిని ముఖములును రెక్కలును ఉండెను. |
9
|
వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను. |
10
|
ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖ ములు కలవు. |
11
|
వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను, ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి యుండెను; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను. |
12
|
అవన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మ యే వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవు చుండెను. |
13
|
ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పుల తోను దివిటీలతోను సమానములు; ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను, ఆ అగ్ని అతికాంతిగా ఉండెను, అగ్నిలోనుండి మెరుపు బయలుదేరుచుండెను. |
14
|
మెరుపు తీగెలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగు చుండెను. |
15
|
ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి యెదుట ముఖముల ప్రక్కను చక్రమువంటిదొకటి కనబడెను. |
16
|
ఆ చక్రములయొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలె నుండెను, ఆ నాలుగును ఒక్క విధముగానే యుండెను. వాటి రూప మును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను. |
17
|
అవి జరుగునప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను, వెనుకకు తిరుగకయే జరుగుచుండెను. |
18
|
వాటి కైవారములు మిక్కిలి యెత్తుగలవై భయంకరముగా ఉండెను, ఆ నాలుగు కైవారములు చుట్టు కండ్లతో నిండి యుండెను. |
19
|
ఆ జీవులు కదలగా ఆ చక్రములును వాటి ప్రక్కను జరిగెను, అవి నేలనుండి లేచినప్పుడు చక్ర ములుకూడ లేచెను. |
20
|
ఆత్మ యెక్కడికి పోవునో అక్క డికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను; జీవికున్న ఆత్మ, చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను. |
21
|
జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములును జరుగుచుండెను, అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి నేలనుండి లేవగా ఇవియు వాటితోకూడ లేచెను. |
22
|
మరియు జీవుల తలలపైన ఆకాశమండలము వంటి విశాలతయున్నట్టుండెను. అది తళతళలాడు స్ఫటిక ముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి యుండెను. |
23
|
ఆ మండలమువంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి యొకదానిప్రక్క ఒకటి పైకి చాప బడియుండెను; రెండేసి వాటి దేహములు కప్పుచుండెను, ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును, అనగా ప్రతిజీవికిని ఆలాగున రెక్కలుండెను. |
24
|
అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని; అది విస్తార మైన ఉదకముల ఘోషవలెను సర్వశక్తుడగు దేవుని స్వరము వలెను దండువారు చేయు ధ్వనివలెను ఉండెను, అవి నిలుచునప్పుడెల్ల తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. |
25
|
అవి నిలిచి రెక్కలను వాల్చునప్పుడు వాటి తలలకు పైగా నున్న ఆకాశ మండలమువంటి దానిలోనుండి శబ్దము పుట్టెను. |
26
|
వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపి యగు ఒకడు ఆసీనుడైయుండెను. |
27
|
చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కన బడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలు కొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కన బడెను, చుట్టును తేజోమయముగా కనబడెను. |
28
|
వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను. |
Ezekiel 1:19 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...