Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Deuteronomy Chapters

Deuteronomy 31 Verses

Bible Versions

Books

Deuteronomy Chapters

Deuteronomy 31 Verses

1 మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లనెనునేడు నేను నూట ఇరువది యేండ్లవాడనై యున్నాను.
2 ఇకమీదట నేను వచ్చుచుపోవుచు నుండలేను, యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను.
3 నీ దేవు డైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ యెదుట నుండకుండ నశింపజేయును, నీవు వారి దేశ మును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చి యున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును.
4 యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోను కును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకా రముగానే యీ జనములకును చేయును.
5 నేను మీ కాజ్ఞాపించిన దానినంతటినిబట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుడి
6 భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడ బాయడు.
7 మరియు మోషే యెహోషువను పిలిచినీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణముచేసిన దేశ మునకు నీవు వీరితోకూడ పోయి దానిని వారికి స్వాధీన పరచవలెను.
8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై యుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయ పడకుము విస్మయమొందకు మని ఇశ్రాయేలీయు లందరియెదుట అతనితో చెప్పెను.
9 మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయుల కును ఇశ్రాయేలీయుల పెద్దలందరికిని దాని నప్పగించి
10 వారితో ఇట్లనెనుప్రతి యేడవ సంవత్సరాంతమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున
11 నీ దేవు డైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయు లందరు ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచ రించునప్పుడు ఇశ్రాయేలీయులందరి యెదుట ఈ ధర్మ శాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను.
12 మీ దేవు డైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యము లన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను.
13 ఆలాగు నేర్చుకొనినయెడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని, మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దా నును దాటబోవుచున్న దేశమున మీరు బ్రదుకు దినము లన్నియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చు కొందురు.
14 మరియు యెహోవాచూడుము; నీ మరణదినములు సమీపించెను; నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవియ్యగా,
15 మోషేయు యెహోషువయు వెళ్లి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను; ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారముపైని నిలువగా
16 యెహోవా మోషేతో యిట్లనెనుఇదిగో నీవు నీ పితరు లతో పండుకొనబోవుచున్నావు. ఈ జనులు లేచి, యెవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనులమధ్యను వ్యభిచారులై, ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి, నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు.
17 కావున నా కోపము ఆ దినమున వారిమీద రగులు కొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా యీ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు.
18 వారు అన్యదేవతలతట్టు తిరిగి చేసిన కీడంతటినిబట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును.
19 కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము.
20 నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత, వారు తిని త్రాగి తృప్తిపొంది క్రొవ్వినవారై అన్యదేవతలతట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు.
21 విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారియెదుట సాక్షిగానుండి సాక్ష్యము పలు కును. అది మరువబడక వారి సంతతి వారినోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునుపే, నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనెను.
22 కాబట్టి మోషే ఆ దినమందే యీ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను.
23 మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషు వకు ఈలాగు సెలవిచ్చెనునీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయు లను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడై యుందును.
24 ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సాంతముగా వ్రాయుట ముగించిన తరువాత
25 మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగామీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసికొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి.
26 అది అక్కడ నీమీద సాక్ష్యార్థముగా ఉండును.
27 నీ తిరుగుబాటును నీ మూర్ఖ త్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంక సజీవుడనై మీతో ఉండగానే, ఇదిగో మీరు యెహోవామీద తిరుగుబాటుచేసితిరి.
28 నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురుకదా మీ గోత్ర ముల పెద్దలనందరిని మీ నాయకులను నాయొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారిమీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను.
29 ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకాజ్ఞా పించిన మార్గమును తప్పుదు రనియు, ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగు ననియు నేనెరుగుదును. మీరు చేయు క్రియలవలన యెహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైనదాని చేయుదురు.
30 అప్పుడు మోషే ఇశ్రాయేలీ యుల సర్వ సమాజముయొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సాంతముగా పలికెను.

Deuteronomy 31:22 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×