మీ మనస్సు సిద్ధమై యున్నదని నేనెరుగుదును. అందువలనసంవత్సరమునుండి అకయ సిద్ధపడియున్నదని చెప్పి, నేను మిమ్మును గూర్చి మాసిదోనియవారియెదుట అతిశయపడుచున్నాను; మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి.
మీరు సిద్ధపడని యెడల ఒకవేళ మాసిదోనియవారెవరైనను నాతోకూడ వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచినయెడల, ఈ నమి్మక కలిగియున్నందుకు మేము సిగ్గు పరచబడుదుము; మీరును సిగ్గుపరచబడుదురని యిక చెప్పనేల?
కావున లోగడ ఇచ్చెదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్య వలెనని చెప్పి, సహోదరులు మీ యొద్దకు ముందుగావచ్చి దానిని జమచేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని.
విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యముగలవారగునట్లు, మీ నీతిఫలములు వృద్ధిపొం దించును.
ఏలాగనగా క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందుచేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసి నందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు.