Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

2 Chronicles Chapters

2 Chronicles 10 Verses

Bible Versions

Books

2 Chronicles Chapters

2 Chronicles 10 Verses

1 రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీయులందరును షెకెమునకు వెళ్లగా రెహబాముషెకెమునకు పోయెను.
2 రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తునుండి తిరిగిరాగా జనులు అతని పిలిపించిరి.
3 యరొబామును ఇశ్రాయేలువారందరును కూడి వచ్చి నీ తండ్రి మా కాడిని బరువుచేసెను;
4 నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మామీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులుకన చేసినయెడల మేము నిన్ను సేవింతు మని రెహబాముతో మనవిచేయగా
5 అతడుమీరు మూడు దినములు తాళి మరల నాయొద్దకు రండని చెప్పెను గనుక జనులు వెళ్లిపోయిరి.
6 అప్పుడు రాజైన రెహ బాము తన తండ్రియైన సొలొమోను సజీవియై యుండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి--యీ జనులకు నేనేమి ప్రత్యుత్తర మియ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగగా
7 వారునీవు ఈ జనులయెడల దయా దాక్షిణ్యములు చూపి వారితో మంచి మాటలాడినయెడల వారు ఎప్పటికిని నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి.
8 అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసి వేసి, తనతోకూడ పెరిగి తన యెదుటనున్న ¸°వనస్థులతో ఆలోచనచేసి
9 నీ తండ్రి మామీద ఉంచిన కాడిని చులుకన చేయుమని నన్నడిగిన యీ జనులకు ప్రత్యుత్తరమేమి ఇయ్యవలెనని మీరు యోచింతురో చెప్పుడని వారినడుగగా
10 అతనితో కూడ పెరిగిన యీ ¸°వనస్థులు అతనితో ఇట్లనిరినీ తండ్రి మా కాడిని బరువుచేసెను, నీవు దానిని చులుకన చేయుమని నీతో పలికిన యీ జనులతో నీవు చెప్పవలసినదేమనగానా చిటికెన వ్రేలు నా తండ్రియొక్క నడుముకంటె బరువుగా ఉండును;
11 నా తండ్రి బరువైన కాడి మీమీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను గాని నేను కొరడాలతో మిమ్మును దండించెదనని చెప్పుము.
12 మూడవ దినమందు నాయొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరును మూడవ దినమందు రెహబామునొద్దకు రాగా
13 రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి, ¸°వనస్థులు చెప్పిన ప్రకారము వారితో మాటలాడి
14 వారికి కఠినమైన ప్రత్యుత్తరమిచ్చెను; ఎట్లనగానా తండ్రి మీ కాడిని బరువుచేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడా లతో దండించెదనని చెప్పెను.
15 యెహోవా షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించక పోయెను.
16 రాజు తాము చేసిన మనవి అంగీకరింపక పోవుట చూచి జనులుదావీదులో మాకు భాగము ఏది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు;ఇశ్రా యేలువారలారా, మీ గుడారమునకు పోవుడి; దావీదూ,నీ సంతతివారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యు త్తరమిచ్చి ఇశ్రాయేలువారందరును ఎవరి గుడారమునకు వారు వెళ్లిపోయిరి.
17 అయితే యూదాపట్టణములలో కాపురముండు ఇశ్రాయేలువారిమీద రెహబాము ఏలుబడి చేసెను.
18 రాజైన రెహబాము వెట్టిపనివారిమీద అధికారి యైన హదోరమును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతని చావ గొట్టిరి గనుక రాజైన రెహబాము యెరూష లేమునకు పారిపోవలెనని త్వరపడి తన రథము ఎక్కెను.
19 ఇశ్రాయేలువారు ఇప్పటికిని దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసి నేటివరకును వారికి లోబడకయున్నారు.

2-Chronicles 10:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×