1
|
ఉత్తమ సిద్ధాంతాల ప్రకారం సత్యాన్ని అనుసరించుమని ప్రజలకు బోధించు. |
2
|
వృద్ధులకు శాంతంగా ఉండుమని, గౌరవంగా జీవించుమని, ఆత్మనిగ్రహం, సంపూర్ణమైన విశ్వాసం, ప్రేమ, సహనము కలిగి ఉండుమని బోధించు. |
3
|
అదే విధంగా వృద్ధ స్త్రీలకు పవిత్రంగా జీవించుమని, ఇతర్లను దూషించకూడదని, త్రాగుబోతులు కాకూడదని, మంచిని మాత్రమే ఉపదేశమిమ్మని చెప్పు. |
4
|
అలా చేస్తే వాళ్ళు యౌవన స్త్రీలకు తమ భర్తల్ని, తమ పిల్లల్ని ప్రేమించాలని, |
5
|
ఆత్మనిగ్రహం కలిగి ఉండి పవిత్రంగా జీవించాలని, తమ గృహనిర్వాహక కర్తవ్యాలను పూర్తి చెయ్యాలని, దయను అలవరచుకోవాలని, వారి భర్తలకు విధేయతగా ఉండాలని ఉపదేశించి శిక్షణనిస్తారు. అప్పుడు దైవసందేశాన్ని ఎవ్వరూ విమర్శించరు. |
6
|
అదే విధంగా మనోనిగ్రహం కలిగి ఉండుమని యువకులకు భోధించు. |
7
|
నీవు స్వయంగా ఉత్తమ కార్యాలు చేస్తూ వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి. నీవు భోధించేటప్పుడు మనస్పూర్తిగా, గంభీరంగా భోధించు. |
8
|
విమర్శకు గురికాకుండా జాగ్రత్తగా భోధించు. అప్పుడు నీ శత్రువు విమర్శించటానికి ఆస్కారం దొరకక సిగ్గుపడతారు. |
9
|
బానిసలు తమ యజమానుల యిష్టానుసారం నడుచుకోవాలని బోధించు. తమ యజమానులకు ఆనందం కలిగేటట్లు మసలుకోవాలనీ, వాళ్ళకు ఎదురు తిరిగి మాట్లాడరాదని వాళ్ళకు బోధించు. |
10
|
తమ యజమానులనుండి, దొంగిలించరాదనీ, తమ యజమానులు తమను విశ్వసించేటట్లు నడుచుకోవాలనీ బోధించు. అప్పుడే మన రక్షకుడైన దేవుని గురించి నేర్చుకొన్నవి సార్థకమౌతాయి. |
11
|
ఎందుకంటే, మానవులకు రక్షణ కలిగించే దైవానుగ్రహం అందరికి ప్రత్యక్షమైంది. |
12
|
అది నాస్తికత్వాన్ని, ఐహిక దురాశల్ని మానివేయుమని బోధిస్తుంది. మనోనిగ్రహం కలిగి, క్రమశిక్షణతో, ఆత్మీయంగా ఈ ప్రపంచంలో జీవించుమని బోధిస్తుంది, |
13
|
మనం ఆశిస్తున్న ఆ గొప్ప రోజు వస్తుందని, ఆ రోజున మన గొప్ప దేవుడునూ మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు కనిపిస్తాడని నిరీక్షిస్తూ ఉన్నాము. |
14
|
అన్ని పాపాలనుండి మనకు విముక్తి కలగాలని యేసు క్రీస్తు తనను తాను అర్పించుకొన్నాడు. సత్కార్యాలు చెయ్యాలని ఉత్సాహపడుతున్న ఈ ప్రజలు ఈ యేసు క్రీస్తుకు చెందిన వాళ్ళు. ఆయన వాళ్ళను తనకోసం పవిత్రంగా చేసాడు. |
15
|
నీవు ఈ విషయాలను బోధించాలి. సంపూర్ణమైన అధికారంతో ప్రజలను ఉత్సాహపరుస్తూ, ఖండిస్తూ, నిన్ను ఎవ్వరూ ద్వేషించకుండా జాగ్రత్త పడుము. |
Titus 2:7 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...