1
|
ఒక తెలివిగల కుమారుడు అతడు ఏమి చేయాలని అతని తండ్రి చెబుతాడో, దానిని జాగ్రత్తగా వింటాడు. కానీ గర్విష్ఠి వినడు. తనది తప్పు అని అతడు ఎన్నడూ నమ్ముడు. |
2
|
మంచి వాళ్లు, తాము చెప్పే మంచి విషయాలకు బహుమానం పొందుతారు. కానీ దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు చేయాలని ఆలోచిస్తారు. |
3
|
తాను చెప్పే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఉండే మనిషి తన ప్రాణం కాపాడుకొంటాడు. కానీ ఆలోచన లేకుండా మాట్లాడే మనిషి నాశనం చేయబడతాడు. |
4
|
బద్ధకస్తునికి వస్తువులు కావాలి, కానీ అతడు వాటిని ఎన్నటకీ పొందలేడు. కానీ కష్టపడి పని చేసేవాళ్లు, తాము కోరుకొనే వాటిని పొందుతారు. |
5
|
మంచివాళ్లు అబద్ధాలను అసహ్యించుకొంటారు. దుర్మార్గులు అవమానించబడతారు. |
6
|
మంచితనం, నిజాయితీగల మనిషిని మంచితనం కాపాడుతుంది. కానీ పాపం చేయాలని ఇష్టపడేవాడికి కీడు కలుగుతుంది. |
7
|
కొంతమంది మనుష్యులు ధనికుల్లా నటిస్తారు, కానీ వారికి ఏమి వుండదు. ఇతరులు పేదవాళ్లలా నటిస్తారు, కానీ వాస్తవానికి వారు ధనికులు. |
8
|
ఒక ధనికుడు తనప్రాణం కాపాడుకొనేందుకు వెల చెల్లించాల్సి వస్తుందేమో. కానీ పేదవాళ్లకు అలాంటి బెదిరింపులు ఏమీ వుండవు. |
9
|
ఒక మంచి మనిషి ప్రకాశవంతంగా వెలిగే దీపంలా ఉంటాడు. కానీ దుర్మార్గుడు ఆరిపోయే దీపంలా ఉంటాడు. |
10
|
ఇతరులకంటె తామే మంచివాళ్లము అనుకొనే మనుష్యులు కష్టం మాత్రమే కలిగిస్తారు. అయితే ఇతరులు తమకు చెప్పే విషయాలను వినేవారు జ్ఞానము గలవారు. |
11
|
డబ్బు సంపాదించటంకోసం ఒక వ్యక్తి మోసం చేస్తే, ఆ డబ్బు త్వరలోనే పోతుంది. అయితే తన డబ్బును కష్టపడి సంపాదించే మనిషి దానిని మరీ ఎక్కువగా పెంచుకొంటాడు. |
12
|
నిరీక్షణ లేకపోతే హృదయానికి దు:ఖం. నీవు కోరుకొన్నది సంభవిస్తే, అప్పుడు ఆనంద భరితుడవు. |
13
|
ఒక వ్యక్తికి ఇతరులు సహాయం చేయటానికి ప్రయత్నించినప్పుడు అతడు వినిపించుకోకపోతే, అప్పుడు అతడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. అయితే ఇతరులు తనకు చెప్పిన సంగతులను గౌరవించేవాడు బహుమానం పొందుతాడు. |
14
|
జ్ఞానముగల మనిషి యొక్క ఉపదేశాలు జీవాన్ని ఇస్తాయి. ఆ మాటలు మరణ బంధకాల నుండి తప్పించుకొనుటకు సహాయం చేస్తాయి. |
15
|
తెలివిగల మనిషిని మనుష్యులు గౌరవిస్తారు. కానీ ఒక వ్యక్తి నమ్మదగిన వాడు కానప్పుడు అతనికి కష్టం కలుగుతుంది. |
16
|
జ్ఞానముగల మనిషి ఏదైనా చేయకముందే అతడు ఆలోచిస్తాడు. అయితే బుద్దిహీనుడు చేసే బుద్దిహీనత వలన అతడు మూర్ఖుడౌతాడు. |
17
|
ఒక వార్తాహరుడు నమ్మజాలని వాడైతే, అప్పుడు అతని చుట్టూ కష్టం ఉంటుంది. అయితే ఒక వ్యక్తి నమ్మదగిన వాడైతే శాంతి ఉంటుంది. |
18
|
ఒక వ్యక్తి తన తప్పుల మూలంగా నేర్చుకొనేందుకు నిరాకరిస్తే, అప్పుడు అతడు పేదవాడై, సిగ్గుపడతాడు. కానీ ఒక మనిషి విమర్శింట బడినప్పుడు, శిక్షించబడినప్పుడు వినుపించుకొంటే లాభం పొందుతాడు. |
19
|
ఒక మనిషి ఏదైనా కోరుకొని దానిని పొందితే, అతనికి చాలా సంతోషం. కానీ మూర్ఖులు కీడునే కోరుకొంటారు. వారు మారుటకు అంగీకరించరు. |
20
|
జ్ఞానముగల వారితో స్నేహంగా ఉండు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు. కానీ బుద్ధిహీనులను నీ స్నేహితులుగా నీవు ఎంచుకొంటే అప్పుడు నీవు కష్టాల్లో పడతావు. |
21
|
పాపులు ఎక్కడికి వెళ్లినా కష్టం వారిని తరుముతుంది. కానీ మంచివాళ్లకు మంచి సంగతులు జరుగుతాయి. |
22
|
మంచి మనిషి దగ్గర అతడు తన పిల్లలకు, మనవలకు ఇచ్చేందుకు ఐశ్వర్యం ఉంటుంది. చివరికి చెడ్డవాళ్లకు ఉన్నవి అన్నీ మంచివాళ్ల పాలవుతాయి. |
23
|
ఒక పేదవానికి విస్తారమైన ఆహారం పండించగల మంచి భూమి ఉండవచ్చును. కానీ అతడు చెడు నిర్ణయాలు చేసి, ఆకలితో ఉంటాడు. |
24
|
ఒక వ్యక్తి తన పిల్లలను నిజంగా ప్రేమిస్తే, వారు తప్పు చేసినప్పుడు అతడు వారిని సరిదిద్దుతాడు. నీవు నీ కుమారుని ప్రేమిస్తే, అతనికి సరైన మార్గం నేర్పించేందుకు నీవు జాగ్రత్తగా ఉంటావు. |
25
|
మంచి వాళ్లకు నిజంగా వారికి కావాల్సినవి ఉంటాయి. కానీ దుర్మార్గుకి అవసరత కలిగివుంటుంది. |
Proverbs 13:16 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...