1
|
బంగారం ఎలా నల్లబడిందో చూడు. మంచి బంగారం ఎలా మారి పోయిందో చూడు. ఆభరణాలన్నీ నలుపక్కలా విసరివేయబడ్డాయి. ప్రతి వీధి మూలలో ఆ నగలు వెదజల్లబడ్డాయి. |
2
|
సీయోను ప్రజలకు ఒకనాడు చాలా విలువ వుండేది. వారికి బంగారంతో సరితూగే విలువ వుండేది. కాని ఈనాడు శత్రువు వారిని మట్టి కుండల్లా చుస్తున్నాడు. కుమ్మరి చేసిన మట్టి కుండల్లా ఈనాడు శత్రువు వారిని చూస్తున్నాడు. |
3
|
నక్క సహితం తన పిల్లలకు పొదుగు అందిస్తుంది. నక్క సహితం తన పిల్లలను పాలు తాగనిస్తుంది. కాని నా ప్రజల కుమార్తె (ఇశ్రాయేలు స్త్రీలు) మాత్రం కఠినాత్మురాలు. ఆమె ఎడారిలో నివసించే ఉష్ట్రపక్షిలా వుంది. |
4
|
దహంతో పసిబిడ్డ నాలుక అంగిట్లో అతుక్కు పోతుంది. చిన్న పిల్లలు అన్నానికి అలమటిస్తారు. కాని వారికి ఎవ్వరూ ఆహారం ఇవ్వరు. |
5
|
ఒకనాడు విలువైన భోజనం చేసినవారు, ఈనాడు వీధులో చనిపోతాన్నారు. అందమైన ఎర్రని దుస్తుల్లో పెరిగిన ప్రజలు ఇప్పుడు చెత్త కుండీలలో ఏరుకుంటున్నారు. |
6
|
నా ప్రజల కుమార్తె (యెరూషలేము స్త్రీలు) చేసిన పాపం మిక్కిలి ఘోరమైనది. వారి పాపం సొదొమ, గొమొర్రాల పాపాలకు మించివుంది. సొదొమ, గొమొర్రా పట్టణాలు అకస్మాత్తుగా నాశనం చేయబడ్డాయి. ఏ మానవ హస్తమో చేసిన వినాశనం కాదది. |
7
|
దేవుని సేవకు ప్రత్యేకంగా అంకితమైన యూదా మనుష్యులు మంచుకంటె తెల్లనివారు. వారు పాలకంటె తెల్లనివారు. వారి శరీరాలు పగడంలా ఎర్రనివి. వారి దేహకాంతి నీలమువంటిది. |
8
|
కాని వారి ముఖాలు ఇప్పుడు మసికంటె నల్లగా తయారైనాయి. వీధీలో వారిని ఎవ్వరూ గుర్తు పట్టలేరు. వారి ఎముకలపై వారి చర్మం ముడుతలు పడింది. వారి చర్మం కట్టెలా అయిపోయింది. |
9
|
కరువుతో మాడి చనిపోయిన వారి స్థితికంటె కత్తి వేటుకు గురియైన వారు అదృష్టవంతులు. ఆకలిచే మాడేవారు దుఃఖభాగ్యులు. వారు గాయపర్చబడ్డారు. పొలాల నుండి పంటలురాక వారు ఆకలితో చనిపోయారు. |
10
|
ఆ సమయంలో ఉత్తమ స్త్రీలు కూడా తమ స్వంత పిల్లలను వండుకొని తిన్నారు. ఆ పిల్లలు తమ తల్లులకు ఆహార మయ్యారు. నా ప్రజలు నాశనం చేయబడినప్పుడు ఇది జరిగింది. |
11
|
యెహోవా తన కోపాన్నంతా ప్రయోగించాడు. తన కోపాన్నంతా ఆయన కుమ్మరించాడు. సీయోనులో ఆయన అగ్నిని ప్రజ్వరిల్ల జేశాడు. ఆ అగ్ని సీయోను పునాదులను తగులబెట్టింది. |
12
|
జరిగిన దానిని ప్రపంచ రాజులెవ్వరూ నమ్మలేకపోయారు. ప్రపంచ ప్రజానీకం ఏది సంభవించిందో దానిని నమ్మలేకపోయింది. శత్రువులు యెరూషలేము నగర ద్వారాల గుండా లోనికి ప్రవేశింపగలరని వారు అనుకోలేదు. |
13
|
యెరూషలేము ప్రవక్తలు పాపం చేసిన నేరానికి ఇది జరిగింది. యెరూషలేము యాజకులు దుష్ట కార్యాలు చేయటం వలన ఇది సంభవించింది. యెరూషలేము నగరంలో ఆ మనుష్యులు రక్తం చిందించుతున్నారు. వారు మంచివారి రక్తన్ని పారిస్తున్నారు. |
14
|
ప్రవక్తలు, యాజకులు అంధుల్లా వీధుల్లో తిరిగాడారు. వారు రక్తసిక్తమై మలినపడ్డారు. వారు మలినపడిన కారణంగా ఎవ్వరూ వారి బట్టలనుకూడ ముట్టరు. |
15
|
“పొండి! దూరంగా పొండి! మమ్మల్ని తాకవద్దు.” ఆ ప్రజలు చుట్టుపక్కల తిరుగాడినారు. వారికి నివాసం లేదు. “వారు మాతో కలిసి నివసించటం మాకు ఇష్టం లేదు.” అని అన్యదేశీయులు అన్నారు. |
16
|
యెహోవాయే ఆ ప్రజలను నాశనం చేశాడు. ఆయన వారి బాగోగులు ఎంతమాత్రం తెలుసు కోలేదు. ఆయన యాజకులను గౌరవించలేదు. ఆయన యూదా పెద్దలతో స్నేహ భావంతో లేడు. |
17
|
మా కండ్లు పనిచేయటం మానివేశాయి. మేము సహాయం కొరకు నిరీక్షించాము. కాని అది రాలేదు. ఆ నిరీక్షణలో కండ్లు అలసిపోయాయి. ఏదో ఒక రాజ్యం వచ్చి మమ్మల్ని రక్షిస్తుందని అదే పనిగా ఎదురుచూశాము. మా కావలి బురుజులపై నుండి మేము చూశాము. కాని ఏ దేశమూ మమ్మల్ని కాపాడటానికి రాలేదు. |
18
|
అన్ని వేళలా మా శత్రువులు మమ్మల్ని వేటాడారు. మేము కనీసం వీధులలోకి కూడ పోలేకపోయాము. మా అంతం సమీపించింది. మాకు సమయం దగ్గర పడింది. మాకు అంతిమకాలం వచ్చేసింది! |
19
|
మమ్మల్ని వేటాడిన మనుష్యులు ఆకాశంలో గద్దల కంటె వేగవంతులు. ఆ మనుష్యులు మమ్మల్ని పర్వతాలలోకి తరిమివేశారు. మమ్మల్ని పట్టుకోవటానికి వారు ఎడారిలో మాటువేశారు. |
20
|
మా ముక్కు రంధ్రాలలో ఊపిరిలా మెలగిన మా రాజును వారు తమ గోతిలో పట్టుకున్నారు. రాజు యెహోవాచే అభిషిక్తము చేయబడిన వ్యక్తి. “మేము ఆయన నీడలో నివసిస్తాము; ప్రపంచ రాజ్యాల మధ్య మేము ఆయన నీడలో నివసిస్తాము,” అని మేము మా రాజును గురించి చెప్పుకున్నాము. |
21
|
ఎదోము ప్రజలారా, సంతోషంగా ఉండండి, అనందించండి. ఊజు రాజ్యంలో నివసించే ప్రజలారా, సంతోషంగా వుండండి. కాని ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. యెహోవా కోపపు గిన్నె మీవద్దకు కూడా వస్తుంది. మీరు దానిని తాగినప్పుడు, మీకు మత్తెక్కుతుంది. ఆ మత్తులో మిమ్మల్ని మీరు దిగంబరులుగా చేసుకుంటారు. |
22
|
సీయోనూ, నీ శిక్ష పూర్తి అయ్యింది. మరెన్నడూ నీవు చెరపట్టబడవు. కాని ఎదోము ప్రజలారా, యెహోవా మీర పాపాలకు తగిన శిక్ష విధిస్తాడు. ఆయన మీ పాపాలను బహిర్గతం చేస్తాడు. |
Lamentations 4:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...