1
|
చేప కడుపులో ఉన్నంతకాలం యోనా తన దేవుడైన యెహోవాను ప్రార్థించాడు. యోనా ఇలా అన్నాడు: |
2
|
“నేను తీవ్రమైన కష్టంలో ఉన్నాను. నేను యెహోవా సహాయం అర్థించాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు! నేను పాతాళపు లోతుల్లో ఉన్నాను. యెహోవా, నేను నీకు మొరపెట్టుకొనగా నీవు నా మొరాలకించావు! |
3
|
నీవు నన్ను సముద్రంలోకి విసరివేశావు. తీవ్రమైన నీ అలలు నన్ను ముంచెత్తాయి. నేనీ అగాధ సముద్రం లోతులదాకా పోయాను. నా చుట్టూ జల ప్రళయం. |
4
|
‘ఇక నేను చుడలేని స్థలానికి తోయబడ్డాను’ అని అనుకున్నాను. కాని సహాయం కొరకు నేను నీ పవిత్ర ఆలయం వైపు చూస్తూనే ఉన్నాను. |
5
|
“సముద్రజలం నన్ను ముంచి వేసింది. నీరు నా నోటిని మూసివేసింది, నేను శ్వాస పీల్చు కోలేకుండా ఉన్నాను. ఈ సముద్రపు లోతులలోకి నేను వెళ్లాను. సముద్రపు మొక్కలు నా తలకు చుట్టుకున్నాయి. |
6
|
పర్వతాల పునాదులున్న చోట, సముద్రపు అట్టడుగున నేను ఉన్నాను. ఈ చెరలో నేను శాశ్వతంగా మూయబడి ఉన్నాననుకున్నాను. కానీ నా దేవుడైన యెహోవా నన్ను నా సమాధి నుండి బయటకు లేపాడు! ఓ నా దేవా, నీవు నాకు మళ్లీ ప్రాణం పోశావు! |
7
|
“నా ఆత్మ నిరాశ చెందింది, అప్పుడు నేను యెహోవాను తలచుకొన్నాను. యెహోవా, నిన్ను నేను ప్రార్థించాను. నీ పవిత్రాలయంలో నీవు నా ప్రార్థనలు విన్నావు. |
8
|
కొంతమంది ప్రజలు పనికిరాని విగ్రహాలను పూజిస్తారు. కానీ ఆ విగ్రహాలు వారికి ఎన్నడూ సహాయం చేయలేవు. |
9
|
యెహోవా నుండి మాత్రమే రక్షణ లభిస్తుంది! “యెహోవా, నీకు నేను బలులు అర్పిస్తాను. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీకు నేను ప్రత్యేక మొక్కులు మొక్కుతాను. నా మొక్కుబడులు నేను చెల్లిస్తాను.” |
10
|
అప్పుడు యెహోవా చేపతో మాట్లాడాడు. తరువాత ఆ చేప తన కడుపులో ఉన్న యోనాను పొడిగా ఉన్న నేలమీదకు కక్కివేసింది. |
Jonah 2:8 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...