“నేను తీవ్రమైన కష్టంలో ఉన్నాను. నేను యెహోవా సహాయం అర్థించాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు! నేను పాతాళపు లోతుల్లో ఉన్నాను. యెహోవా, నేను నీకు మొరపెట్టుకొనగా నీవు నా మొరాలకించావు!
“సముద్రజలం నన్ను ముంచి వేసింది. నీరు నా నోటిని మూసివేసింది, నేను శ్వాస పీల్చు కోలేకుండా ఉన్నాను. ఈ సముద్రపు లోతులలోకి నేను వెళ్లాను. సముద్రపు మొక్కలు నా తలకు చుట్టుకున్నాయి.
పర్వతాల పునాదులున్న చోట, సముద్రపు అట్టడుగున నేను ఉన్నాను. ఈ చెరలో నేను శాశ్వతంగా మూయబడి ఉన్నాననుకున్నాను. కానీ నా దేవుడైన యెహోవా నన్ను నా సమాధి నుండి బయటకు లేపాడు! ఓ నా దేవా, నీవు నాకు మళ్లీ ప్రాణం పోశావు!
యెహోవా నుండి మాత్రమే రక్షణ లభిస్తుంది! యెహోవా, నీకు నేను బలులు అర్పిస్తాను. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీకు నేను ప్రత్యేక మొక్కులు మొక్కుతాను. నా మొక్కుబడులు నేను చెల్లిస్తాను.”