(6-7) ఏహూదు సంతతి వారు గెబలో వారి వారి కుటుంబాలకు పెద్దలు. వారు బలవంతంగా ఇండ్లు విడిచి మనహతుకు పోయేలా చేయబడ్డారు. ఏహూదు సంతతి వారు నయమాను, అహీయా, గెరా అనేవారు. గెరా వారిని బలవంతంగా ఇండ్లు వదిలిపోయేలా చేసాడు. గెరా కుమారులు ఉజ్జా, అహీహూదు.
(9-10) షహరయీముకు యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము, యోవూజును, షాక్యా, మిర్మా అనే కుమారులు తన భార్యయగు హోదెషు వలన కలిగారు. వారంతా షహరయీము సంతానం. వారు కుటుంబ పెద్దలయ్యారు.
(12-13) ఎల్పయల కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు, బెరీయా, షెమ అనువారు. ఓనో పట్టణాన్ని, లోదును, దాని చుట్టూ వున్న గ్రామాలను షెమెదు నిర్మించాడు. బెరీయా, షెమ అనువారిద్దరూ అయ్యాలోనులో నివసించే వారి కుటుంబ పెద్దలు. వారు గాతులో నివసిస్తున్న వారిని వెళ్లగొట్టారు.
ఊలాము కుమారులు ధనుర్బాణాలు పట్టగల నేర్పరులు, బలమైన సైనికులు. వారికి చాలా మంది కుమారులు, మనుమలు ఉన్నారు. కొడుకులు, మనుమలు అంతా నూట ఏబది మంది ఉన్నారు. వీరంతా బెన్యామీను సంతతివారు.