హెబ్రోను పట్టణంలో దావీదుకు కొందరు కుమారులు పుట్టారు. ఆ కుమారులు ఎవరనగా: దావీదు మొదటి కుమారుడు అమ్నోను. అమ్నోను తల్లి పేరు అహీనోయము. ఆమె యెజ్రెయేలుకు చెందిన స్త్రీ, రెండవ కుమారుని పేరు దానియేలు. అతని తల్లి పేరు అబీగయీలు. ఆమె కర్మేలుకు చెందినది.
దావీదుకు ఈ ఆరుగురు కుమారులు హెబ్రోనులో జన్మించారు. దావీదు అక్కడ ఏడు సంవత్సరాల ఆరు నెలలపాటు పాలించాడు. దావీదు యెరూషలేములో ముప్పదిమూడు సంవత్సరాలు రాజుగా ఉన్నాడు.
యెహోయాకీము సంతానంలో యెకొన్యా, అతని కుమారుడు: సిద్కియా, అతని కుమారుడు వున్నారు. [*యెహోయాకీము … కుమారుడు వున్నారు దీనిని రెండు రకాలుగా వివరించవచ్చు మొదటిగా ఈ సిద్కియా యెహోయాకీము కుమారుడు మరియు యెకొన్యా సోదరుడు అనీ; రెండవదిగా ఈ సిద్కియా యెకొన్యా కుమారుడు మరియు యెహోయాకీము మనుమడు అని చెప్పవచ్చు.]
యెహోయాకీను [†యెహోయాకీను యెకొన్యా, యెహోయాకీను ఇద్దరూ ఒక్కరే. ఒకే పేరును రెండు రకాలుగా రాయటం జరిగింది.] బబలోనులో బందీ అయిన పిమ్మట యెకొన్యా సంతానం ఎవరనగా: షయల్తీయేలు,