1
|
సైన్యంలో చేరి రాజు సేవలో నిమగ్నమైన ఇశ్రాయేలీయుల వివరణ: ప్రతి సంవత్సరంలోను ప్రతి సమూహం ఒక నెలపాటు తమ విధికి హాజరయ్యేది. రాజును సేవించిన వారిలో వంశాలకు అధిపతులు, శతదళాధిపతులు, సహస్ర దళాధిపతులు, మరియు రక్షక భటులు వున్నారు. ప్రతి సైనిక విభాగంలోను ఇరవైనాలుగు వేలమంది మనుష్యులున్నారు. |
2
|
మొదటి నెలలో మొదటి దళానికి యాషాబాము అధిపతి. యాషాబాము తండ్రి పేరు జబ్దీయేలు. యాషాబాము దళంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులున్నారు. |
3
|
యాషాబాము పెరెజు సంతతివారిలో ఒకడు. యాషాబాము సైనికాధికారులందరికీ మొదటి నెలలో అధిపతి. |
4
|
రెండవ నెలలో సైనిక దళానికి దోదై అధిపతి. అతడు అహూయహు సంతతివాడు (అహోహీయుడు). దోదై విభాగంలో ఇరవై నాలుగువేల మంది ఉన్నారు. |
5
|
మూడవ అధికారి బెనాయా. మూడవ నెలలో బెనాయా సైనికాధికారి. బెనాయా తండ్రి పేరు యెహోయాదా. యెహోయాదా ప్రముఖ యాజకుడు. బెనాయా దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు. |
6
|
ముప్పది మంది మహా యోధుల్లోగల బెనాయా ఇతడే. వారిని బెనాయా నడిపించాడు. బెనాయా కుమారుడు అమ్మీజాబాదు. బెనాయా దళానికి నిర్వాహకుడుగా వున్నాడు. |
7
|
నాల్గవ అధికారి అశాహేలు. అతడు నాల్గవ నెలలో దళాధిపతి. అశాహేలు యోవాబు సోదరుడు. తరువాత అశాహేలు కుమారుడు జెబద్యా తన తండ్రి స్థానంలో అధిపతి అయ్యాడు. అశాహేలు దళంలో ఇరవైనాలుగు వేలమంది సైనికులు వున్నారు. |
8
|
ఐదవ అధికారి షమ్హూతు. షమ్హూతు ఐదవ నెలలో అధిపతి. షమ్హూతు ఇశ్రాహేతీయుడు. షమ్హూతు విభాగంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు. |
9
|
ఆరవ అధిపతి ఈరా. ఈరా ఆరవ నెలలో అధిపతి. ఈరా తండ్రి పేరు ఇక్కెషు. ఇక్కెషు తెకోవ పట్టణంవాడు. ఈరా విభాగంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు. |
10
|
ఏడవ అధిపతి హేలెస్సు. హేలెస్సు ఏడవ నెలలో అధిపతి. అతడు పెలోనీయుడు. ఎఫ్రాయిము సంతతికి చెందినవాడు. హేలెస్సు దళంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులు వున్నారు. |
11
|
ఎనిమిదవ అధిపతి సిబ్బెకై. సిబ్బెకై ఎనిమిదవ నెలలో అధిపతి. సిబ్బెకై హుషాతీయుడు. అతడు జెరహు సంతతివాడు. సిబ్బెకై విభాగంలో ఇరవై నాలుగు వేలమంది సైనికులు వున్నారు. |
12
|
తొమ్మిదవ అధిపతి అబీయెజెరు. అబీయెజెరు తొమ్మిదవ నెలలో అధిపతి. అబీయెజెరు అనాతోతు పట్టణం వాడు. అతడు బెన్యామీనీయుడు. అబీయెజెరు దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు. |
13
|
పదవ అధిపతి మహరై. మహరై పదవ నెలలో అధిపతి. మహరై నెటోపాతీయుడు. అతడు జెరహు సంతతివాడు. మహరై దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులున్నారు. |
14
|
పదకొండవ అధిపతి బెనాయా. బెనాయా పదకొండవ నెలలో అధిపతి. అతడు పిరాతోనీయుడు. బెనాయా ఎఫ్రాయిము సంతతివాడు. బెనాయా వర్గంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు. |
15
|
పన్నెండవ అధిపతి హెల్దయి. పన్నెండవ నెలలో అధిపతి హెల్దయి. అతడు నెటోపాతీయుడు. హెల్దయి ఓత్నీయేలు కుటుంబీకుడు. హెల్దయి దళంలో ఇరవై నాలుగువేల మంది సైనికులు వున్నారు. |
16
|
ఇశ్రాయేలు వంశాలు, వాటి పెద్దలు ఎవరనగా: రూబేను: జిఖ్రీ కుమారుడైన ఎలీయెజెరు. “షిమ్యోను: మయకా కుమారుడైన షెఫట్య. |
17
|
లేవీ: కెమూయేలు కుమారుడైన హషబ్యా. అహరోను: సాదోకు. |
18
|
యూదా: దావీదు సోదరులలో ఒకడై ఎలీహు. ఇశ్శాఖారు: మిఖాయేలు కుమారుడగు ఒమ్రీ. |
19
|
జెబూలూను: ఓబద్యా కుమారుడైన ఇష్మయా. నఫ్తాలి: అజీ్రయేలు కుమారుడైన యెరీమోతు. |
20
|
ఎఫ్రాయిము: అజజ్యాహు కుమారుడైన హోషేయ. పశ్చిమ మనష్షే: పెదాయా కుమారుడైన యోవేలు. |
21
|
తూర్పు మనష్షే: జెకర్యా కుమారుడైన ఇద్దో. బెన్యామీను: అబ్నేరు కుమారుడగు యహశీయేలు. |
22
|
దాను: యెహోరాము కుమారుడు అజరేలు. వారంతా ఇశ్రాయేలు వంశాలకు అధిపతులు. |
23
|
ఇశ్రాయేలు జనాభా లెక్కలు తీయటానికి దావీదు నిర్ణయించాడు. అయితే వారు అసంఖ్యాకంగా వున్నారు. ఎందువల్లననగా దేవుడు ఇశ్రాయేలు వారిని ఆకాశంలో నక్షత్రాల్లా వృద్ధిచేస్తానని చెప్పాడు. అందువల్ల దావీదు ఇరవై ఏండ్ల వయస్సు వారిని, అంతకు పైబడిన వయస్సు వారిని మాత్రమే లెక్కించమన్నాడు. |
24
|
సెరూయా కుమారుడైన యోవాబు జనాభా లెక్కలు ప్రారంభించాడు. కాని పూర్తి చేయలేదు . ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు మిక్కిలి కోపం చెందాడు. అందువల్ల రాజైన దావీదు పాలన గురించిన చరిత్ర గ్రంథంలో జనాభాసంఖ్య చేర్చబడలేదు. |
25
|
రాజుయొక్క ఆస్తి కాపాడటంలో బాధ్యతగల వారెవరనగా: అదీయేలు కుమారుడు అక్మావెతు ఆధీనంలో రాజగిడ్డంగులు వుంచారు. చిన్న చిన్న పట్టణాలలోను, గామాలలోను, పొలాలలోను, దుర్గాలలోను వున్న వస్తువులను భధ్రపరచు గదులకు బాధ్యత, ఉజ్జీయా కుమారుడైన యోనాతానుకు ఇవ్వబడింది. |
26
|
వ్యవసాయ కూలీలపై కెలూబు కుమారుడైన ఎజీ నియమితుడయ్యాడు. |
27
|
ద్రాక్షా తోటల సంరక్షణాధికారి షిమీ, షిమీ రామా పట్టణానికి చెందినవాడు. ద్రాక్షాతోటలనుండి సేకరించిన ద్రాక్షా రసపు నిల్వలు, వాటి పరిరక్షణ బాధ్యత జబ్దికి ఇవ్వబడింది. జబ్ది షెపాము ఊరివాడు. |
28
|
పడమటి కొండల ప్రాంతంలో ఒలీవ చెట్ల, మేడి చెట్ల పరిరక్షణ, నిర్వహణ బాధ్యత బయల్ హనాను వహించాడు. బయల్ హనాను గెదేరీయుడు. ఒలీవ నూనె నిల్వల మీద అధికారి యోవాషు. |
29
|
షారోను ప్రాంతంలో మేసే ఆవుల మీద పర్యవేక్షకుడు షిట్రయి. షిట్రయి షారోను ప్రాంతంవాడు. లోయలోని ఆవుల మీద అధికారి అద్లయి కుమారుడైన షాపాతు. |
30
|
ఒంటెలపై అధికారి ఓబీలు ఇష్మాయేలీయుడు. గాడిదల సంరక్షణాధికారి యెహెద్యాహు. యెహెద్యాహు మేరోనో తీయుడు. |
31
|
గొర్రెల విషయం చూసే అధికారి యాజీజు. యాజీజు హగ్రీయుడు. నాయకులైన ఈ వ్యక్తులందరూ రాజైన దావీదు ఆస్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి నియమితులయ్యారు. |
32
|
యోనాతాను తెలివైన సలహాదారు. పైగా లేఖకుడు. యోనాతాను దావీదు పినతండ్రి. రాజకుమారుల యోగక్షేమాలు తెలుసుకోవటానికి హక్మోనీ కుమారుడైన యెహీయేలు నియమింపబడ్డాడు. |
33
|
అహీతోపెలు రాజుకు సలహాదారు (మంత్రి). హూషై రాజుకు స్నేహితుడు (చెలికాడు). హూషై అర్కీయుడు. |
34
|
అహీతోపెలు తరువాత అతని స్థానంలో యెహోయాదా మరియు అబ్యాతారు లిరువురూ రాజుకు సలహాదారులయ్యారు. యెహోయాదా తండ్రి పేరు బెనాయా. యోవాబు రాజు సేనకు అధిపతి. |
1-Chronicles 27:10 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...