1
|
రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, |
2
|
దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు మరియు ఆషేరు అనేవారు ఇశ్రాయేలు కుమారులు. |
3
|
ఏరు, ఓనాను, షేలా అనేవారు యూదా కుమారులు. వీరి తల్లి పేరు బత్ షూయ . ఈమె కనానీయురాలు. యూదా పెద్ద కుమారుడు ఏరు దుష్టుడైనట్లు యెహోవా గమనించాడు. అందువల్ల ఆయన అతనిని చంపివేశాడు. |
4
|
యూదా కోడలు తామారుకు అతని వల్లనే పెరెసు, జెరహు అను కవల కుమారులు కలిగారు . ఆ విధంగా యూదాకు ఐదుగురు కుమారులయ్యారు. |
5
|
పెరెసు కుమారులు హెస్రోను, హామూలు. |
6
|
జెరహు సంతానం ఐదుగురు: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్కోలు, దార్ద. |
7
|
జిమ్రీ కుమారుడు కర్మీ. కర్మీ కుమారుడు ఆకాను . ఇతడు ఇశ్రాయేలు వారికి అనేక కష్టాలు తెచ్చాడు. ఇతడు యుద్ధంలో తీసుకున్న వస్తువులను దేవునికివ్వకుండా తన వద్దనే వుంచుకొన్నాడు. |
9
|
హెస్రోను కుమారులు యెరహ్మయేలు, రాము, కెలూబై . |
10
|
రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను యూదా ప్రజల నాయకుడు . |
11
|
నయస్సోను కుమారుడు శల్మా. శల్మా కుమారుడు బోయజు. |
12
|
బోయజు కుమారుడు ఓబెదు. ఓబెదు కుమారుడు యెష్షయి. |
13
|
యెష్షయి పెద్ద కుమారుడు ఏలీయాబు. యెష్షయి రెండవ కుమారుడు అబీనాదాబు. అతని మూడవ కుమారుడు షమ్మాను (షిమియ). |
14
|
నెతనేలు యెష్షయికి నాల్గవ కుమారుడు. అతని ఐదవ కుమారుడు రద్దయి. |
15
|
యెష్షయి ఆరవ కుమారుడు ఓజెము కాగా ఏడవ కుమారుడు దావీదు. |
16
|
సెరూయా, అబీగయీలు ఇద్దరూ వారి తోడబట్టిన ఆడపిల్లలు. సెరూయాకు అబీషై, యోవాబు, అశాహేలు అనే ముగ్గురు కుమారులు. |
17
|
అబీగయీలు కుమారుడు అమాశా. అమాశా తండ్రి పేరు యెతెరు. యెతెరు ఇష్మాయేలీయులవాడు. |
18
|
హెస్రోను కుమారుడు కాలేబు. తన భార్య అజూబా ద్వారా కాలేబు సంతానవంతుడయ్యాడు. అజూబా యెరీయోతు కుమార్తె. యేషెరు, షోబాబు మరియు అర్దోను అనేవారు అజూబా కుమారులు. |
19
|
అజూబా చనిపోయిన పిమ్మట కాలేబు ఎఫ్రాతాను పెండ్లి చేసుకొన్నాడు. కాలేబుకు ఎఫ్రాతావల్ల హూరు అనే కుమారుడు కలిగాడు. |
20
|
ఊరి అనేవాడు హూరు కుమారుడు. ఊరికి బెసలేలు అను కుమారుడు కలిగాడు. |
21
|
పిమ్మట హెస్రోను అరువది సంవత్సరాల వాడైనప్పుడు మాకీరు కుమార్తెను వివాహమాడాడు. మాకీరు అనేవాడు గిలాదుకు తండ్రి. హెస్రోను మాకీరు కుమార్తెను కలియగా ఆమెకు సెగూబు అనేవాడు పుట్టెను. |
22
|
సెగూబుకు పుట్టినవాడు యాయీరు. యాయీరుకు గిలాదు దేశంలో ఇరవైమూడు నగరాలున్నాయి. |
23
|
కాని గెషూరు వారు, అరాము (సిరియ) వారు యాయీరు గ్రామాలను తీసుకొన్నారు. వాటిలో కెనాతు, దాని చుట్టుపట్ల గ్రామాలు వున్నాయి. అవి మొత్తం అరువది చిన్న చిన్న పట్టణాలు. ఈ పట్టణాలన్నీ గిలాదు తండ్రి అయిన మాకీరు సంతతివారికి చెందినవి. |
24
|
హెస్రోను కాలేబదైన ఎఫ్రాతాలో చనిపోయాడు. హెస్రోను చనిపోయిన తరువాత అతని భార్య అబీయా ప్రసవించింది. ఆ పుట్టినవాని పేరు అష్షూరు. అష్షూరుకు పుట్టినవాడు తెకోవ. |
25
|
యెరహ్మయేలు హెస్రోను పెద్ద కుమారుడు. రాము, బూనా, ఓరెను, ఓజెము మరియు అహీయా అనేవారు యెరహ్మెయేలు కుమారులు. యెరహ్మెయేలు పెద్ద కుమారుడు రాము. |
26
|
యెరహ్మెయేలుకు అటారా అనే మరొక భార్య ఉన్నది. అటారా ఓనాముకు తల్లి. |
27
|
యెరహ్మెయేలు పెద్ద కుమారుడు రాముకు కుమారులున్నారు. వారి పేర్లు మయజు, యామీను, ఏకెరు. |
28
|
షమ్మయి, యాదా ఇద్దరూ ఓనాము కుమారులు. నాదాబు, అబీషూరులిద్దరూ షమ్మయి కుమారులు. |
29
|
అబీషూరు భార్య పేరు అబీహయిలు. అబీహయిలు అతనికి ఇద్దరు కుమారులను కన్నది. అబాను, మొలీదు అని వారి పేర్లు. |
30
|
సెలెదు, అప్పయీములిద్దరూ నాదాబు కుమారులు. సెలెదు సంతానం లేకుండానే చనిపోయాడు. |
31
|
అప్పయీము కుమారుని పేరు ఇషీ. ఇషీ కుమారుడు షేషాను. షేషాను కుమారుని పేరు అహ్లయి. |
32
|
షమ్మయి సోదరుని పేరు యాదా. యెతెరు, యోనాతాను ఇద్దరూ యాదా కుమారులు. యెతెరు సంతానం లేకుండానే మరణించాడు. |
33
|
పేలెతు, జాజాలిద్దరూ యోనాతాను కుమారులు. ఇది యెరహ్మెయేలు సంతతి జాబితా. |
34
|
షేషానుకు కుమారులు లేరు. అతనికి అందరూ కుమార్తెలే. షేషాను వద్ద ఈజిప్టుకు చెందిన ఒక సేవకుడున్నాడు. వాని పేరు యర్హా. |
35
|
షేషాను కుమార్తెను, యర్హా వివాహం చేసికొన్నాడు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. వాని పేరు అత్తయి. |
36
|
అత్తయి కుమారుని పేరు నాతాను. నాతాను కుమారుడు జాబాదు. |
37
|
జాబాదు కుమారుడు ఎఎ్లాలు. ఎఎ్లాలు కుమారుడు ఓబేదు. |
38
|
ఓబేదు కుమారుడు యెహూ. యెహూ కుమారుడు అజర్యా. |
39
|
అజర్యా కుమారుడు హేలెస్సు. హేలెస్సు కుమారుడు ఎలాశా. |
40
|
ఎలాశా కుమారుడు సిస్మాయీ. సిస్మాయీ కుమారుడు షల్లూము. |
41
|
షల్లూము కుమారుడు యెకమ్యా. యెకమ్యా కుమారుడు ఎలీషామా. |
42
|
యెరహ్మయేలు సోదరుడు కాలేబు. కాలేబుకు కొందరు కుమారులున్నారు. అతని మొదటి కుమారుడు మేషా. మేషా కుమారుడు జీపు. జీపు కుమారుడు మారేషా. మారేషా కుమారుడు హెబ్రోను. |
43
|
హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము మరియు షెమ అనువారు. |
44
|
షెమ కుమారుడు రహము. రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి. |
45
|
షమ్మయి కుమారుడు మాయోను. మాయోను కుమారుడు బేత్సూరు. |
46
|
కాలేబు దాసి పేరు ఏయిఫా. ఏయిఫా కుమారులు హారాను, మోజా మరియు గాజేజు అనువారు. హారాను కుమారుని పేరు కూడ గాజేజు. |
47
|
యెహ్దయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా మరియు షయపు. |
48
|
మయకా అనే స్త్రీ కాలేబు యొక్క మరో దాసి. మయకాకు పుట్టిన కుమారులు షెబెరు మరియు తిర్హానా అనేవారు. |
49
|
మయకా ఇంకా షయపు, షెవా అను వారికి కూడ తల్లి. షయపు కుమారుడు మద్మన్నా. షెవా కుమారులు మక్బేనా మరియు గిబ్యా. కాలేబు కుమార్తె పేరు అక్సా. |
50
|
ఇది కాలేబు సంతతి: కాలేబు మొదటి కుమారుని పేరు హూరు. ఇతడు ఎఫ్రాతాకు పుట్టినవాడు. హూరు కుమారుడు శోబాలు. శోబాలు కుమారుని పేరు కిర్యత్యారీము. |
51
|
తరువాతివారు శల్మా మరియు హారేపు. శల్మా కుమారుడు బెత్లేహేము. హారేపు కుమారుడు బేత్గాదేరు. |
52
|
శోబాలు కిర్యత్యారీము స్థాపకుడు . శోబాలు సంతతి వారు: హారోయే మరియు మనుహతీలోని వారిలో సగంభాగం: |
53
|
మరియు కిర్యత్యారీము సంతతి కుటుంబాల వారు. వీరు: ఇత్రీయులు, పూతీయులు, షుమ్మాతీయులు, మిష్రాయీయులు. మిష్రాయీయుల సంతతివారే సొరాతీయులు, ఎష్తాయులీయులు. |
54
|
శల్మా సంతతి వారెవరనగా: బేత్లెహేము, నెటోపాతీయులు, అతారోతు, బేత్యోవాబు ప్రజలు; మనుహతీయులలో సగం మందిగా వున్న జారీయులు, 55మరియు యబ్బేజులో నివసిస్తున్న చరిత్రాది విషయాలు, దస్తావేజులు రాసే లేఖకులు. ఈ లేఖకులు తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులకు చెందిన వంశాల వారు. హమాతు సంతతి వారైన కేనీయులే ఈ లేఖకులు. బేత్ - రేకాబు వంశీయులకు హమాతు మూలపురుషుడు. |
55
|
[This verse may not be a part of this translation] |
1-Chronicles 2:53 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...