ఏరు, ఓనాను, షేలా అనేవారు యూదా కుమారులు. వీరి తల్లి పేరు బత్ షూయ. [*బత్‌షూయ షూయ కుమార్తె అని దీని అర్థం. ఆది. 38:2 చూడండి.] ఈమె కనానీయురాలు. యూదా పెద్ద కుమారుడు ఏరు దుష్టుడైనట్లు యెహోవా గమనించాడు. అందువల్ల ఆయన అతనిని చంపివేశాడు.
యూదా కోడలు తామారుకు అతని వల్లనే పెరెసు, జెరహు అను కవల కుమారులు కలిగారు. [†యూదా … కలిగారు యూదా కోడలైన తామారుతో కలియుట వలన ఆమె గర్భవతియైనది. ఆది. 38:12-30 చూడండి.] ఆ విధంగా యూదాకు ఐదుగురు కుమారులయ్యారు.
జిమ్రీ కుమారుడు కర్మీ. కర్మీ కుమారుడు ఆకాను. [‡ఆకాను యెహోషువా (7:1) పుస్తకంలో ఆకారు పేరు ఆకాను అని వుంది. కష్టకారకుడని దాని అర్థం. ఇతడు దేవుని ప్రత్యేక నగరమైన యెరికో నుండి వస్తువులను సేకరించి ఇశ్రాయేలుకు కష్టాలు తెచ్చి పెట్టాడు.] ఇతడు ఇశ్రాయేలు వారికి అనేక కష్టాలు తెచ్చాడు. ఇతడు యుద్ధంలో తీసుకున్న వస్తువులను దేవునికివ్వకుండా తన వద్దనే వుంచుకొన్నాడు.
రాము కుమారుడు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను యూదా ప్రజల నాయకుడు. [*నయస్సోను … నాయకుడు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుంచి విముక్తులై బయటకు వచ్చినప్పుడు నయస్సోను యూదా వంశీయులకు నాయకుడు. సంఖ్యా. 1:7, 2:3 మరియు 7:12 చూడండి.]
కాని గెషూరు వారు, అరాము (సిరియ) వారు యాయీరు గ్రామాలను తీసుకొన్నారు. వాటిలో కెనాతు, దాని చుట్టుపట్ల గ్రామాలు వున్నాయి. అవి మొత్తం అరువది చిన్న చిన్న పట్టణాలు. ఈ పట్టణాలన్నీ గిలాదు తండ్రి అయిన మాకీరు సంతతివారికి చెందినవి.
హెస్రోను కాలేబదైన ఎఫ్రాతాలో చనిపోయాడు. హెస్రోను చనిపోయిన తరువాత అతని భార్య అబీయా ప్రసవించింది. ఆ పుట్టినవాని పేరు అష్షూరు. అష్షూరుకు పుట్టినవాడు తెకోవ.
యెరహ్మయేలు సోదరుడు కాలేబు. కాలేబుకు కొందరు కుమారులున్నారు. అతని మొదటి కుమారుడు మేషా. మేషా కుమారుడు జీపు. జీపు కుమారుడు మారేషా. మారేషా కుమారుడు హెబ్రోను.
మరియు యబ్బేజులో నివసిస్తున్న చరిత్రాది విషయాలు, దస్తావేజులు రాసే లేఖకులు. ఈ లేఖకులు తిరాతీయులు, షిమ్యాతీయులు, శూకోతీయులకు చెందిన వంశాల వారు. హమాతు సంతతి వారైన కేనీయులే ఈ లేఖకులు. బేత్ — రేకాబు వంశీయులకు హమాతు మూలపురుషుడు.