1
|
అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను |
2
|
ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురతతగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది. |
3
|
నాకు అవమానము కలుగజేయు నిందను నేను విన్నం దుకునా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది. |
4
|
దుష్టులకు విజయము కొద్దికాలముండునుభక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముండును. |
5
|
ఆదినుండి నరులు భూమిమీద నుంచబడిన కాలముమొదలుకొనిఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా? |
6
|
వారి ఘనత ఆకాశమంత యెత్తుగా పెరిగిననుమేఘములంత యెత్తుగా వారు తలలెత్తినను |
7
|
తమ మలము నశించురీతిగా వారెన్నటికిని నుండకుండ నశించుదురు.వారిని చూచినవారువారేమైరని యడుగుదురు. |
8
|
కల యెగసిపోవునట్లు వారు గతించి కనబడక పోవుదురురాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు. |
9
|
వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదువారి స్థలమున వారు మరి ఎప్పుడును కనబడరు |
10
|
వారి సంతతివారు దరిద్రుల దయను వెదకెదరువారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. |
11
|
వారి యెముకలలో ¸°వనబలము నిండియుండునుగాని అదియు వారితో కూడ మంటిలో పండుకొనును. |
12
|
చెడుతనము వారి నోటికి తియ్యగా నుండెనువారు నాలుకక్రింద దాని దాచిపెట్టిరి. |
13
|
దాని పోనియ్యక భద్రముచేసికొనిరి, నోట దానినుంచుకొనిరి. |
14
|
అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారిలోపట నాగుపాముల విషమగును. |
15
|
వారు ధనమును మింగివేసిరి గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురు. |
16
|
వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును.వారు కట్లపాముల విషమును పీల్చుదురునాగుపాము నాలుక వారిని చంపును. |
17
|
ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు. |
18
|
దేనికొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరోదానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరువారు సంపాదించిన ఆస్తికొలది వారికి సంతోషముండదు |
19
|
వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారువారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తిచేయరు. |
20
|
వారు ఎడతెగక ఆశించినవారుతమ యిష్టవస్తువులలో ఒకదానిచేతనైనను తమ్మునుతాము రక్షించుకొనజాలరు. |
21
|
వారు మింగివేయనిది ఒకటియు లేదు గనుక వారిక్షేమస్థితి నిలువదు. |
22
|
వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బందిపడుదురుదురవస్థలోనుండు వారందరి చెయ్యి వారిమీదికివచ్చును. |
23
|
వారు కడుపు నింపుకొననైయుండగాదేవుడు వారిమీద తన కోపాగ్ని కురిపించునువారు తినుచుండగా దాని కురిపించును. |
24
|
ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగాఇత్తడివిల్లు వారి దేహములగుండ బాణములను పోవిడు చును. |
25
|
అది దేహమును చీల్చి వారి శరీరములోనుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములోనుండి పైత్యపు తిత్తి వచ్చును, మరణభయము వారి మీదికి వచ్చును. |
26
|
వారి ధననిధులు అంధకారపూర్ణములగునుఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయునువారి గుడారములో మిగిలినదానిని అది కాల్చివేయును. |
27
|
ఆకాశము వారి దోషమును బయలుపరచునుభూమి వారిమీదికి లేచును. |
28
|
వారి యింటికివచ్చిన ఆర్జన కనబడకపోవునుదేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. |
29
|
ఇది దేవునివలన దుష్టులైన నరులకు ప్రాప్తించుభాగముదేవునివలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే. |
Job 20:1 Hindi Language Bible Words basic statistical display
COMING SOON ...