Indian Language Bible Word Collections
Psalms 4:8
Psalms Chapters
Psalms 4 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Books
Old Testament
New Testament
Psalms Chapters
Psalms 4 Verses
1
|
నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ముఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవేనన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము. |
2
|
నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు?ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు? |
3
|
యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి.నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును. |
4
|
భయమునొంది పాపము చేయకుడిమీరు పడకలమీద నుండగా మీ హృదయములలోధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.) |
5
|
నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవానునమ్ముకొనుడి |
6
|
మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు.యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము. |
7
|
వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములోపుట్టించితివి. |
8
|
యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. |