Indian Language Bible Word Collections
Job 6:22
Job Chapters
Job 6 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Books
Old Testament
New Testament
Job Chapters
Job 6 Verses
1
|
ఈ మాట ఆలకించి నీ మేలుకొరకు తెలిసికొనుము.దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను |
2
|
నా దుఃఖము చక్కగా తూచబడును గాకదాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులోపెట్టబడును గాక. |
3
|
ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రములఇసుకకన్న బరువుగా కనబడును. అందువలన నేను నిరర్థకమైన మాటలు పలికితిని. |
4
|
సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెనువాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నదిదేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. |
5
|
అడవిగాడిద గడ్డి చూచి ఓండ్ర పెట్టునా?ఎద్దు మేత చూచి రంకెవేయునా? |
6
|
ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా? |
7
|
నేను ముట్టనొల్లని వస్తువులు నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెను. |
8
|
ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాకనేను కోరుదానిని దేవుడు నెరవేర్చును గాక |
9
|
దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాకచేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. |
10
|
అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండ లేదని నేను ఆదరణ పొందుదునుమరియు నేనెంత వేదనపడుచుండినను దాని బట్టి హర్షించుదును |
11
|
నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల?నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల? |
12
|
నా బలము రాళ్ల బలమువంటిదా?నా శరీరము ఇత్తడిదా? |
13
|
నాలో త్రాణ యేమియు లేదు గదా.శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయెను గదా. |
14
|
క్రుంగిపోయినవాడుసర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మాను కొనిననుస్నేహితుడు వానికి దయచూపతగును. |
15
|
నా స్నేహితులు ఎండిన వాగువలెనుమాయమై పోవు జలప్రవాహములవలెను నమ్మకూడని వారైరి. |
16
|
మంచుగడ్డలుండుటవలననుహిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును |
17
|
వేసవి రాగానే అవి మాయమై పోవునువెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. |
18
|
వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును, ఏమియులేకుండ అవి యింకిపోవును. |
19
|
సమూహముగా ప్రయాణముచేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురుషేబ వర్తకులు వాటికొరకు కనిపెట్టుదురు. |
20
|
వారు వాటిని నమి్మనందుకు అవమానమొందుదురువాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. |
21
|
అటువలె మీరు లేనట్టుగానే యున్నారుమీరు ఆపదను చూచి భయపడుచున్నారు. |
22
|
ఏమైన దయచేయుడని నేను మిమ్ము నడిగితినా? మీ ఆస్తిలోనుండి నాకొరకు బహుమానమేమైన తెమ్మని యడిగితినా? |
23
|
పగవానిచేతిలోనుండి నన్ను విడిపింపుడని యడిగితినా?బాధించువారి చేతిలోనుండి నన్ను విమోచింపుడనియడిగితినా? |
24
|
నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదనుఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకుతెలియజేయుడి. |
25
|
యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? |
26
|
మాటలను గద్దించుదమని మీరనుకొందురా?నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా. |
27
|
మీరు తండ్రిలేనివారిని కొనుటకై చీట్లువేయుదురు,మీ స్నేహితులమీద బేరము సాగింతురు. |
28
|
దయచేసి నావైపు చూడుడి, మీ ముఖము ఎదుటనేను అబద్ధమాడుదునా? |
29
|
అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడిమరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును. |
30
|
నా నోట అన్యాయముండునా?దుర్మార్గత రుచి నా నోరు తెలిసికొనజాలదా? |