1
|
మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై... యీలాగు సెలవిచ్చెను |
2
|
నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన యిద్దరు స్త్రీలు కలరు. |
3
|
వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, ¸°వనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. |
4
|
వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమా రులను కుమార్తెలను కనిరిఒహొలాయను పేరు షోమ్రో నునకును, ఒహొలీబాయను పేరు యెరూ షలేమునకును చెందుచున్నవి. |
5
|
ఒహొలా నాకు పెండ్లిచేయబడినను వ్యభిచారముచేసి |
6
|
తన విటకాండ్రమీద బహుగా ఆశ పెట్టుకొని, ధూమ్రవర్ణముగల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులును అధికారులును అందముగల ¸°వనులును గుఱ్ఱములెక్కు రౌతులును అగు అష్టూరువారిని మోహించెను. |
7
|
అది కాముకురాలిరీతిగా అష్షూరువారిలో ముఖ్యులగు వారందరియెదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటిని పూజించుచు, అపవిత్రురాలాయెను. |
8
|
మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చ టనే దాని ¸°వనమందే పురుషులు దానితో శయ నించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. |
9
|
కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను, అది మోహించిన అష్షూరువారికి దానిని అప్పగించి యున్నాను. |
10
|
వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గముచేత చంపిరి; యీలాగున ఆమె స్త్రీలలో అపకీర్తిపాలై శిక్ష నొందెను. |
11
|
దాని చెల్లెలైన ఒహొలీబా దానిని చూచి కాము కత్వమందు దానిని మించి అక్కచేసిన జారత్వములకంటె మరి ఎక్కువగా జారత్వము చేసెను. |
12
|
ప్రశస్త వస్త్ర ములు ధరించినవారును సైన్యాధిపతులును అధికారులును గుఱ్ఱములెక్కు రౌతులును సౌందర్యముగల ¸°వనులును అగు అష్షూరువారైన తన పొరుగువారిని అది మోహిం చెను. |
13
|
అది అపవిత్రురాలాయెననియు, వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను. |
14
|
మరియు అది యధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై, మొలలకు నడికట్లును తలలమీద చిత్రవర్ణము గల పాగాలును పెట్టుకొని రాచకళలుగలవారై |
15
|
సిందూ రముతో పూయబడి గోడమీద చెక్కబడినవారై, తమ జన్మదేశమైన కల్దీయులదేశపు బబులోను వారివంటి కల్దీ యుల పటములను చూచి మోహించెను. |
16
|
అది వారిని చూచినవెంటనే మోహించి కల్దీయదేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా |
17
|
బబు లోను వారు సంభోగము కోరివచ్చి జారత్వముచేత దానిని అపవిత్ర పరచిరి; వారిచేత అది అపవిత్రపరచబడిన తరు వాత, దాని మనస్సు వారికి యెడమాయెను. |
18
|
ఇట్లు అది జారత్వము అధికముగాచేసి తన మానాచ్ఛాదనము తీసి వేసికొనెను గనుక దాని అక్క విషయములో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయములోను ఆశాభగ్నుడ నైతిని. |
19
|
మరియు ¸°వనదినములందు ఐగుప్తు దేశ ములో తాను జరిగించిన వ్యభిచారము మనస్సునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచు వచ్చెను. |
20
|
గాడిద గుఱ్ఱములవంటి సిగ్గుమాలిన మోహముగల తన విట కాండ్రయందు అది మోహము నిలుపుచుండెను. |
21
|
¸°వనకాలమందు నీవు ఐగుప్తీయులచేత నీ చనులను నలి పించుకొనిన సంగతి జ్ఞాపకము చేసికొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి. |
22
|
కావున ఒహొలీబా, ప్రభువైన యెహోవా సెల విచ్చునదేమనగానీ మనస్సునకు ఎడమైపోయిన నీ విట కాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీమీదికి రప్పించెదను. |
23
|
గుఱ్ఱములనెక్కు బబులోనువారిని కల్దీయులను అధిపతులను ప్రధానాధికారులనందరిని అష్షూరీయులను సౌందర్యముగల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను శూరులను మంత్రులను అందరిని నీమీదికి నేను రప్పించు చున్నాను. |
24
|
ఆయుధములు పట్టుకొని చక్రములుగల రథములతోను గొప్ప సైన్యముతోను వారు నీమీదికి వచ్చి, కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీమీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు, వారు తమ మర్యాదచొప్పున నిన్ను శిక్షించునట్లు నేనునిన్ను గూర్చిన తీర్పు వారికప్పగింతును. |
25
|
ఉగ్రతతో వారు నిన్ను శిక్షించునట్లు నా రోషము నీకు చూపుదును, నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు, నీలో శేషించినవారు ఖడ్గముచేత కూలుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు, నీలో శేషించిన వారు అగ్నిచేత దహింపబడుదురు. |
26
|
నీ బట్టలను లాగి వేసి నీ సొగసైన నగలను అపహరించుదురు. |
27
|
ఐగుప్తును నీవిక కోరకయు, అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనస్సునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తుదేశమం దుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండ ఈలాగున మాన్పించెదను. |
28
|
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగానీవు ద్వేషించినవారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను. |
29
|
ద్వేషముచేత వారు నిన్ను బాధింతురు, నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడు తురు; అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములును నీ జారత్వమును వెల్లడియగును. |
30
|
నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమునుబట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకొనుటనుబట్టియు నీకు ఇవి సంభవించును; నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించి తివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను. |
31
|
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగానీ అక్క పానము చేసిన, లోతును వెడల్పునుగల పాత్రలోనిది నీవును పానము చేయవలెను. |
32
|
అందులో పానము చేయ వలసినది చాలయున్నది గనుక ఎగతాళియు అపహాస్య మును నీకు తటస్థించెను. |
33
|
నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది, నీవు దానిలో నిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు. |
34
|
అడుగుమట్టునకు దాని పానముచేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు; నేనే మాటయిచ్చియున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. |
35
|
ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చు చున్నాడునీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావల సిన శిక్షను నీవు భరించెదవు. |
36
|
మరియు యెహోవా నాకీలాగు సెలవిచ్చెనునర పుత్రుడా, ఒహొలాకును ఒహొలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయుము. |
37
|
వారు వ్యభిచారిణులును నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి, నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్టించిరి. |
38
|
వారీలాగున నాయెడల జరిగించుచున్నారు; అదియుగాక ఆ దినమందే, వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్యదినములుగా ఎంచిరి. |
39
|
తాము పెట్టు కొనిన విగ్రహములపేరట తమ పిల్లలను చంపిననాడే వారు నా పరిశుద్ధస్థలములో చొచ్చి దాని నపవిత్ర పరచి, నామందిరములోనే వారీలాగున చేసిరి. |
40
|
మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి; వారు రాగా వారికొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుకపెట్టుకొని ఆభరణములు ధరించు కొని |
41
|
ఘనమైన మంచముమీద కూర్చుండి బల్లను సిద్ధ పరచి దానిమీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి. |
42
|
ఆలాగున జరుగగా, అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహముయొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారియొద్దకు ఎడారి మార్గమునుండి వచ్చిరి, వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి. |
43
|
వ్యభిచారము చేయుటచేత బలహీనురాలైన దీనితో నేనీలాగంటిని అది మరెన్నటికిని వ్యభిచారముచేయక మానదు. |
44
|
వేశ్యతో సాంగత్యముచేయునట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు, ఆలాగుననే వారు కాముకురాండ్రయిన ఒహొలాతోను ఒహొలీబాతోను సాంగత్యము చేయుచువచ్చిరి. |
45
|
అయితే వ్యభిచారిణు లకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు; వారు వ్యభిచారిణులే, నరహత్యచేయ యత్నించుదురు. |
46
|
ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగావారిమీదికి నేను సైన్య మును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును. |
47
|
ఆ సైనికులు రాళ్లు రువి్వ వారిని చంపుదురు, ఖడ్గముచేత హతము చేయుదురు, వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి యిండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు. |
48
|
స్త్రీలందరు మీ కామాతురతచొప్పున చేయకూడదని నేర్చుకొనునట్లు మీ కామాతురతను దేశములో నుండకుండ మాన్పించుదును. |
49
|
నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు. |
Ezekiel 23:20 English Language Bible Words basic statistical display
COMING SOON ...