1
|
యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము. |
2
|
నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తర మిమ్ము. |
3
|
పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి. |
4
|
ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను. |
5
|
నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహ మునకు అంటుకొని పోయినవి. |
6
|
నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పగిడికంటెవలె నున్నాను. |
7
|
రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను. |
8
|
దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నామీద వెఱ్ఱికోపముగలవారు నా పేరు చెప్పి శపిం తురు. |
9
|
నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను. |
10
|
నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొను చున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు. |
11
|
నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను. |
12
|
యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరము లుండును. |
13
|
నీవు లేచి సీయోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను. |
14
|
దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు |
15
|
అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు |
16
|
ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను |
17
|
ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు. |
18
|
యెహోవాను సేవించుటకై జనములును రాజ్యములును కూర్చబడునప్పుడు |
19
|
మనుష్యులు సీయోనులో యెహోవా నామఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించు నట్లు |
20
|
చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడినవారిని విడిపించుటకును |
21
|
ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమునుండి వంగి చూచెననియు ఆకాశమునుండి భూమిని దృష్టించెననియు |
22
|
వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ వలెను సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును |
23
|
నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నాబలము క్రుంగజేసెను నా దినములు కొద్దిపరచెను. |
24
|
నేనీలాగు మనవిచేసితిని నా దేవా, నాదినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును. |
25
|
ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. |
26
|
అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును. |
27
|
నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు. |
28
|
నీ సేవకుల కుమారులు నిలిచియుందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. |
Psalms 102:18 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...