1
|
దీనినిబట్టి నా హృదయము వణకుచున్నదిదాని స్థలములోనుండి అది కదలింపబడుచున్నది. |
2
|
ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోటనుండి బయలువెళ్లు ధ్వని నాలకించుడి. |
3
|
ఆకాశవైశాల్యమంతటి క్రింద ఆయనదాని వినిపించును భూమ్యంతములవరకు తన మెరుపును కనబడజేయును. |
4
|
దాని తరువాత ఉరుముధ్వని గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడునప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు |
5
|
దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్పకార్యములను ఆయన చేయును. |
6
|
నీవు భూమిమీద పడుమని హిమముతోను వర్షముతోను మహా వర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చు చున్నాడు. |
7
|
మనుష్యులందరు ఆయన సృష్టికార్యమును తెలిసికొను నట్లు ప్రతి మనుష్యుని చేతినిబిగించి ఆయన ముద్రవేసి యున్నాడు. |
8
|
జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి వాటి బిలములలో వసించును. |
9
|
మరుగుస్థానములోనుండి తుఫాను వచ్చును ఉత్తరదిక్కునుండి చలి వచ్చును |
10
|
దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును. |
11
|
మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును. |
12
|
ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెర వేర్చును |
13
|
శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును. |
14
|
యోబూ, ఈ మాట ఆలకింపుము ఊరకుండి దేవుని అద్భుతక్రియలను ఆలోచింపుము. |
15
|
దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలెనని యెట్లు తీర్మానముచేయునో నీకు తెలియునా? |
16
|
మేఘములను తేలచేయుటయు పరిపూర్ణజ్ఞానము గలవాని మహా కార్యములును నీకు తెలియునా? |
17
|
దక్షిణపుగాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా? |
18
|
పోతపోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా? |
19
|
మేము ఆయనతో ఏమి పలుకవలెనో అది మాకు తెలుపుము. చీకటి కలిగినందున మాకేమియు తోచక యున్నది |
20
|
నేను పలుకుదునని యెవడైన ఆయనతో చెప్పదగునా? ఒకడు తాను నిర్మూలము కావలెనని కోరునా? |
21
|
ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ యిప్పుడు కనబడకయున్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కను పరచును. |
22
|
ఉత్తరదిక్కున సువర్ణప్రకాశము పుట్టును దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని యున్నాడు. |
23
|
సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యముగలవాడు. ఆయన మనకు అగోచరుడు.న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరుపడు. అందువలన నరులు ఆయనయందు భయభక్తులు కలిగి యుందురు. |
24
|
తాము జ్ఞానులమనుకొనువారిని ఆయన ఏమాత్రమును లక్ష్యపెట్టడు. |
Job 37:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...