1
|
మరియు ఎలీహు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను |
2
|
నేను పాపము చేసినయెడల నాకు కలిగిన లాభము కన్న నా నీతివలన నాకు కలిగిన లాభమేమి అది నీకు ప్రయోజనమేమి? అనినీవు చెప్పుచున్నావే? |
3
|
ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతికన్న నీ నీతి యెక్కువని నీవనుకొను చున్నావా? |
4
|
నీతోను నీతో కూడనున్న నీ సహవాసులతోను నేను వాదమాడెదను. |
5
|
ఆకాశమువైపు నిదానించి చూడుము నీ కన్న ఉన్నతమైన ఆకాశ విశాలములవైపు చూడుము. |
6
|
నీవు పాపముచేసినను ఆయనకు నీవేమైన చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైన చేసితివా? |
7
|
నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైన ఇచ్చు చున్నావా?ఆయన నీచేత ఏమైనను తీసికొనునా? |
8
|
నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును. |
9
|
అనేకులు బలాత్కారము చేయుటవలన జనులు కేకలు వేయుదురు బలవంతుల భుజబలమునకు భయపడి సహాయముకొరకై కేకలు వేయుదురు. |
10
|
అయితేరాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరే పించుచు |
11
|
భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధినేర్పుచు ఆకాశపక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము కలుగ జేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అను కొనువారెవరును లేరు. |
12
|
కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమునుబట్టి మొఱ్ఱపెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తర మిచ్చుటలేదు. |
13
|
నిశ్చయముగా దేవుడు నిరర్థకమైన మాటలు చెవిని బెట్టడు సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. |
14
|
ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యెము ఆయనయెదుటనే యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలెను. |
15
|
ఆయన కోపముతో దండింపక పోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపక పోయినందునను |
16
|
నిర్హేతుకముగా యోబు మాటలాడి యున్నాడు తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు. |
Job 35:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...