1
|
అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగున ప్రత్యు త్తరమిచ్చెను |
2
|
అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవిఆయన తన ఉన్నతస్థలములలో సమాధానము కలుగ జేయును. |
3
|
ఆయన సేనలను లెక్కింప శక్యమా?ఆయన వెలుగు ఎవరిమీదనైనను ఉదయింపకుండునా? |
4
|
నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడుకాగలడు? |
5
|
ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడునక్షత్రములు పవిత్రమైనవి కావు. |
6
|
మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా. |
Job 25:2 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...