1
|
అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను |
2
|
నా మాట మీరు జాగ్రత్తగా వినుడినా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక. |
3
|
నాకు సెలవిచ్చినయెడల నేను మాటలాడెదనునేను మాటలాడిన తరువాత మీరు అపహాస్యముచేయవచ్చును. |
4
|
నేను మనుష్యునిగురించి మొఱ్ఱపెట్టుకొన్నానా? లేదు గనుక నేను ఏల ఆతురపడకూడదు? |
5
|
నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడినోటిమీద చేయి వేసికొనుడి. |
6
|
నేను దాని మనస్సునకు తెచ్చుకొనినయెడల నాకేమియు తోచకున్నది నా శరీరమునకు వణకు పుట్టుచున్నది. |
7
|
భక్తిహీనులు ఏల బ్రదుకుదురు?వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు? |
8
|
వారుండగానే వారితోకూడ వారి సంతానమువారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. |
9
|
వారి కుటుంబములు భయమేమియు లేక క్షేమముగా నున్నవిదేవుని దండము వారిమీద పడుట లేదు. |
10
|
వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగునువారి ఆవులు ఈచుకపోక ఈనును. |
11
|
వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురువారి పిల్లలు నటనము చేయుదురు. |
12
|
తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురుసానికనాదము విని సంతోషించుదురు. |
13
|
వారు శ్రేయస్సుకలిగి తమ దినములు గడుపుదురుఒక్కక్షణములోనే పాతాళమునకు దిగుదురు. |
14
|
వారునీ మార్గములనుగూర్చిన జ్ఞానము మాకక్కరలేదునీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. |
15
|
మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు?మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు |
16
|
వారి క్షేమము వారి చేతిలో లేదుభక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక. |
17
|
భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదుగదా.వారిమీదికి ఆపద వచ్చుట బహు అరుదు గదా. |
18
|
వారు తుపాను ఎదుట కొట్టుకొనిపోవు చెత్తవలెనుగాలి యెగరగొట్టు పొట్టువలెను ఉండునట్లుఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు గదా. |
19
|
వారి పిల్లలమీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో? అని మీరు చెప్పుచున్నారుచేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చును గాక |
20
|
వారే కన్నులార తమ నాశనమును చూతురుగాకసర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక.తమ జీవితకాలము సమాప్తమైన తరువాత |
21
|
తాము పోయిన తరువాత తమ ఇంటిమీద వారికిచింత ఏమి? |
22
|
ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా?పరలోకవాసులకు ఆయన తీర్పు తీర్చును గదా. |
23
|
ఒకడు తన కడవలలో పాలు నిండియుండగనుతన యెముకలలో మూలుగ బలిసియుండగను |
24
|
సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండుఆయుష్యముతో మృతినొందును |
25
|
వేరొకడు ఎన్నడును క్షేమమనుదాని నెరుగక మనోదుఃఖముగలవాడై మృతినొందును. |
26
|
వారు సమానముగ మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరిని కప్పును. |
27
|
మీ తలంపులు నేనెరుగుదునుమీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి. |
28
|
అధిపతుల మందిరము ఎక్కడ నున్నది?భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే. |
29
|
దేశమున సంచరించువారిని మీరడుగలేదా?వారు తెలియజేసిన సంగతులు మీరు గురుతు పట్ట లేదా? |
30
|
అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురుఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు. |
31
|
వారి ప్రవర్తననుబట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు?వారు చేసినదానినిబట్టి వారికి ప్రతికారము చేయువాడెవడు? |
32
|
వారు సమాధికి తేబడుదురుసమాధి శ్రద్ధగా కావలికాయబడును |
33
|
పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగా నున్నవిమనుష్యులందరు వారివెంబడి పోవుదురుఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగాపోయిరి. |
34
|
మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావుఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగు నన్నుఓదార్చ జూచెదరు? |
Job 21:33 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...