1
|
అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చెను |
2
|
మాటలలో చిక్కుపరచుటకై మీ రెంతసేవు వెదకుదురు?మీరు ఆలోచన చేసి ముగించినయెడల మేము మాట లాడెదము. |
3
|
మీ దృష్టికి మృగములుగానుమూఢులుగాను మేమెంచబడుట ఏల? |
4
|
కోపముచేత నిన్ను నీవు చీల్చుకొనువాడా,నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా?నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? |
5
|
భక్తిహీనుల దీపము ఆర్పివేయబడునువారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. |
6
|
వారి గుడారములో వెలుగు అంధకారమగునువారియొద్దనున్న దీపము ఆరిపోవును |
7
|
వారి పటుత్వముగల నడకలు అడ్డగింపబడునువారి స్వకీయాలోచన వారిని కూల్చును. |
8
|
వారు వాగురలమీద నడచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును. |
9
|
బోను వారి మడిమెను పట్టుకొనునువల వారిని చిక్కించుకొనును. |
10
|
వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడునువారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. |
11
|
నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయునుభయములు వారిని వెంటాడి తరుమును. |
12
|
వారి బలము క్షీణించిపోవునువారిని కూల్చుటకు ఆపద కాచియుండును. |
13
|
అది వారి దేహ అవయవములను భక్షించునుమరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. |
14
|
వారి ఆశ్రయమైన వారి గుడారములోనుండి పెరికివేయబడుదురువారు భీకరుడగు రాజునొద్దకు కొనిపోబడుదురు. |
15
|
వారికి అన్యులైనవారు వారి గుడారములో నివాసము చేయుదురువారి నివాసస్థలముమీద గంధకము చల్లబడును. |
16
|
క్రింద వారి వేళ్లు ఎండిపోవునుపైన వారి కొమ్మలు నరకబడును. |
17
|
భూమిమీద ఎవరును వారిని జ్ఞాపకము చేసికొనరుమైదానమందు ఎక్కడను వారిని ఎరిగినవారు ఉండరు. |
18
|
జనులు వారిని వెలుగులోనుండి చీకటిలోనికి తోలుదురుభూలోకములోనుండి వారిని తరుముదురు. |
19
|
వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైననుఉండరువారు నివసించిన స్థలములో తప్పించుకొనినవాడుఒకడైనను ఉండడు. |
20
|
తర్వాత వచ్చినవారు వారిమీద పడిన శిక్షనుచూచివిస్మయమొందుదురుపూర్వముండినవారు దానిని చూచి దిగులుపడుదురు. |
21
|
నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టునుదేవుని ఎరుగనివారి స్థలము ఇట్టిది. |
Job 18:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...