1
|
అతడు ఉత్తరమార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకొని వచ్చి ఖాలీచోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను. |
2
|
ఆ కట్టడము నూరు మూరల నిడివిగలదై ఉత్తరదిక్కున వాకిలికలిగి యేబది మూరల వెడల్పుగలది. |
3
|
ఇరువది మూరలుగల లోపటి ఆవరణమున కెదురుగాను బయటి ఆవరణపు చఎ్టా కెదురుగాను మూడవ అంతస్థు లోని వసారాలు ఒకదానికొకటి యెదురుగా ఉండెను. |
4
|
గదులకెదురుగా పదిమూరల వెడల్పుగల విహారస్థలముం డెను, లోపటి ఆవరణమునకు పోవుచు ఉత్తరదిక్కు చూచు వాకిండ్లు గల విహారస్థలమొకటి యుండెను, అది మూరెడు వెడల్పు. |
5
|
వాకిండ్లకు వసారాలుండుటవలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్యగదులు ఇరుకుగానుండి కురచవాయెను. |
6
|
మూడవ అంతస్థులో ఉండినవి ఆవరణ ములకున్న వాటివంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రిందిగదులకంటెను మధ్యగదులకంటెను చిన్నవిగా కట్టబడియుండెను. |
7
|
మరియు గదుల వరుసనుబట్టి బయటి ఆవరణముతట్టు గదులకెదురుగా ఏబది మూరల నిడివిగల యొక గోడ కట్టబడియుండెను. |
8
|
బయటి ఆవరణములో నున్న గదుల నిడివి యేబది మూరలుగాని మందిరపు ముందటి ఆవరణము నూరుమూరల నిడివిగలదై యుండెను. |
9
|
ఈ గదులు గోడక్రిందనుండి లేచినట్టుగా కనబడెను, బయటి ఆవరణములోనుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముండెను. |
10
|
విడిచోటునకు ఎదురు గాను కట్టడమున కెదురుగాను ఆవరణపుగోడ మందములో తూర్పుతట్టు కొన్ని గదులుండెను. |
11
|
మరియు వాటి యెదుటనున్న మార్గము ఉత్తరపుతట్టునున్న గదుల మార్గము వలె నుండెను, వాటి నిడివిచొప్పునను వెడల్పు చొప్పు నను ఇవియు కట్టబడెను; వీటి ద్వారములును ఆ రీతినే కట్టబడియుండెను. |
12
|
మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదులయొక్క తలుపులవలె వీటికి తలుపులుండెను, ఆ మార్గము ఆవరణములోనికి పోవు నొకనికి తూర్పుగా నున్న గోడ యెదుటనే యుండెను. |
13
|
అప్పుడాయన నాతో ఇట్లనెను విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులును దక్షిణపుగదులును ప్రతిష్ఠితములైనవి, వాటి లోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతిపరిశుద్ధ వస్తు వులను భుజించెదరు, అక్కడ వారు అతిపరిశుద్ధ వస్తువులను, అనగా నైవేద్యమును పాపపరిహారార్థ బలిపశుమాంసమును అపరాధపరిహారార్థ బలిపశుమాంసమును ఉంచెదరు, ఆ స్థలము అతిపరిశుద్ధము. |
14
|
యాజకులు లోపల ప్రవేశించునప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను; అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరుబట్టలు ధరించుకొనవలెను. |
15
|
అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పుతట్టు చూచు గుమ్మము నకు వచ్చి చుట్టును కొలిచెను. |
16
|
తూర్పుదిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలాయెను. |
17
|
ఉత్తర దిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును |
18
|
దక్షిణదిశను కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును, |
19
|
పశ్చిమదిశను తిరిగి కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును తేలెను. |
20
|
నాలుగుతట్లు అతడు కొలిచెను; ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలమునుండి ప్రత్యేకపరుచుటకై దానిచుట్టు నలుదిశల ఐదువందల బారలుగల చచ్చౌకపు గోడ కట్టబడి యుండెను. |
Ezekiel 42:15 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...