కాబట్టి యీ తాకీదు మీకు ముట్టినవెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన యొకని కోరుకొని, తన తండ్రి సింహాసనముమీద అతనిని ఆసీనునిగా చేసి, మీ యజమానుని కుటుంబికుల పక్షమున యుద్ధమాడుడి.
కుటుంబపు అధి కారియు పట్టణపు అధికారియు పెద్దలును పిల్లలను పెంచిన వారును కూడి యెహూకు వర్తమానము పంపిమేము నీ దాసులము; నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించెదము; మేము ఎవనిని రాజుగా చేసికొనము; నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుమని తెలియజేసిరి.
అప్పు డతడు రెండవ తాకీదు వ్రాయించిమీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనినయెడల మీ యజ మానుని కుమారుల తలలను తీసికొని, రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నాయొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. డెబ్బది మంది రాజకుమారులును వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి.
ఈ ప్రకారము యహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబికులందరిని, అతని సంబంధులగు గొప్పవారినందరిని అతని బంధువుల నందరిని, అతడు నియమించిన యాజకులను హతముచేసెను; అతనికి ఒకనినైనను ఉండనియ్యలేదు.
వారిని సజీవులగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులగా పట్టుకొని యొకనినైన విడువక గొఱ్ఱ వెండ్రుకలు కత్తిరించు ఇంటి గోతిదగ్గర నలువది ఇద్దరిని చంపిరి.
అచ్చటినుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదు ర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశలప్రశ్నలడిగినీయెడల నాకున్నట్టుగా నాయెడల నీకున్నదా అని అతని నడుగగా యెహో నాదాబుఉన్నదనెను. ఆలాగైతే నా చేతిలో చెయ్యి వేయుమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యివేసెను. గనుక యెహూ తన రథముమీద అతనిని ఎక్కించుకొని
కావున ఒకడైనను తప్పకుండ బయలు ప్రవక్తలనందిరిని వాని భక్తులనందరిని వారి యాజ కులనందరిని నాయొద్దకు పిలువనంపించుడి; నేను బయలు నకు గొప్ప బలి అర్పింప బోవుచున్నాను గనుక రానివా డెవడో వాని బ్రదుకనియ్యనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను.
బలులను దహనబలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యెహూ యెనుబది మందిని బయట కావలి యుంచినేను మీ వశముచేసినవారిలో ఒకడైన తప్పించుకొని పోయినయెడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణముతీతునని వారితో చెప్పి యుండెను.
దహనబలుల నర్పించుట సమాప్తికాగా యెహూమీరు లోపల చొచ్చి యొకడైనను బయటికి రాకుండ వారిని చంపుడని తన కావలివారితోను అధిపతుల తోను చెప్పగా వారు అందరిని హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులును వారిని బయటవేసి, బయలు గుడియున్న పట్టణమునకు పోయి
అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యెహూకూడ అందుకు కారకుడై, బేతేలు దాను అను స్థలములందున్న బంగారుదూడలను అనుసరించుట మాన లేదు.
కావున యెహోవా యెహూతో నీలాగు సెల విచ్చెనునీవు నా హృదయాలోచన యంతటిచొప్పున అహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైనదాని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు నాల్గవ తరము వరకు ఇశ్రాయేలురాజ్య సింహాసనముమీద ఆసీనులగుదురు.