తల్లి పాలు కుడిచేనాచిన్నారి తమ్ముడిలా నువ్వు చిట్టి పాపవే అయితే, నువ్వు నాకు బయట అగుపిస్తే, నిన్ను నేను ముద్దాడగలిగి ఉండేదాన్ని. అప్పుడు నన్నెవరూ తప్పు పట్టేవారు కారు!
ఎడారి వెంట, తన ప్రియుని ఆనుకొని వస్తున్న ఈ స్త్రీ ఎవరు? ఆమె అతనితో ఆపిలు చెట్టు నీడలో నిన్ను తట్టి నే లేపాను. అచ్చటే నీ తల్లి తన గర్భాన నిన్ను మోసింది, కన్నది.
నీ హృదయ పీఠం మీద నా రూపం ముద్రించు, నీ వేలికి ముద్రికలా ధరించు. మృత్యువంత బలమైనది ప్రేమ కోపాతిరేకం స్మశాననంతో సమమైనది. రోష విస్ఫులింగాలు జ్వాల అవుతాయి జ్వాలలు పెచ్చు మీరి మహాజ్వాల అవుతాయి.
ఉప్పెన కూడా ప్రేమజ్వాలను ఆర్పజాలదునది జలాలూ ప్రేమను ముంచెత్తజాలవు. ఒకడు ప్రేమ కోసం తన సర్వస్వం ధరపోస్తే, అతణ్ణి ప్రజలు మూర్ఖుడిగా పరిగణించరు. ఎవడూ తప్పు పట్ట జాలడు!
సొలొమోనూ, ఆ వెయ్యి షెకెళ్లూ నీ వే ఉంచుకో, వాటిలో యిన్నూరేసి ఒక్కొక్క రైతుకిచ్చేసెయ్యి అతుడు తెచ్చిన ద్రాక్షాలకు మింజువలె కానైతే, నా ద్రాక్షాతోట నా ఒద్దికలోనే ఉంటుంది!