నా ప్రియ సఖీ, నా ప్రియ వధూ, నేను నా తోటలో ప్రవేశించాను, నేను నా బోళం సుగంధ ద్రవ్యాలను ఏరుకున్నాను, తేనె తాగాను తేనె పొర తిన్నాను నేను నా మధుక్షీరాలు సేవించాను. ప్రియాతి ప్రియ నేస్తాల్లారా తినండి, తాగండి! ప్రేమను జుర్రి మత్తిల్లండి!
నేను నిద్రించానేగాని నా హృదయం మేల్కొనేవుంది. నా ప్రియుడు తలుపు తట్టి ఇలా అనడం విన్నాను “నా ప్రియ సఖీ, ప్రేయసీ నా గువ్వపిట్టా, సుగుణ ఖనీ! నా తల మంచుతో తడిసింది నా జుట్టు రేమంచు జడికి నానింది.”
తలుపు సందులో నా ప్రియుడు చేతినుంచాడు [*తలుపు … చేతినుంచాడు లేక, “తలుపు సందునుంచి తన చేతిని లాక్కున్నాడు” తాళానికీ, తాళం చెవికీ ఇది సూచన కావచ్చు. పురాతనమైన కొన్ని తాళం చెవులు చేయి ఆకారంలో ఉండేవి. ఆ తాళం చెవి తలుపు సందులోంచి లోపలికి జారపబచేవి, ఆతాళం చెవికి చెవికి వున్న “వ్రేళ్లు” ప్రత్యేకమైన రంధ్రాల్లోకి పోయి, గడియను ప్రక్కకి నెట్టేవి. ఈ విధంగా తాళం వేయడం, తీయడం జరిగేది.] నేనతని పట్ల జాలినొందాను. [†నేనతని పట్ల జాలినొందాను శబ్ధార్థ ప్రకారం, “నా అంతరంగం అతనికోసం స్పందించింది.”]
నేను నా ప్రియుడికి తలుపు తెరిచాను, కాని అప్పటికే నా ప్రియుడు వెనుదిరిగి వెళ్లిపోయాడు! అతడు వెళ్లిపోయినంతనే నా ప్రాణం కడగట్టింది. [‡నా ప్రాణం కడగట్టింది. అతను మాట్లాడినప్పుడు నా హృదయము అతని వైపు తిరిగెను.] నేనతని కోసం గాలించాను. కాని అతడు కనిపించలేదు. నేనతన్ని పిలిచాను, కాని అతడు బదులీయలేదు.
అతిలోక సుందరి, ఇతర ప్రియులకంటె నీ ప్రియుని విశేషం ఏమిటి? ఇతర ప్రియుల కన్న నీ ప్రియుడు వేటివేటిలో ఎక్కువా? అంతగా ఎక్కువ కనుకనేనా, మాచేత ప్రమాణం చేయించుకున్నావు?