నన్ను నీతో తీసికొనిపో! మనం పారిపోదాం పద! రాజు తన గదిలోనికి నన్ను తీసుకు పోయాడు. మేము ఆనందిస్తాం నీకోసం హాయిగా ఉంటాం. జ్ఞాపక ముంచుకో, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా బాగుంటుంది మంచి కారణంతోనే యువతులు నిన్ను ప్రేమిస్తారు.
నేనెంత నల్లగా ఉన్నానో చూడవద్దు, సూర్యుడు నన్నెంత నల్లగా చేశాడో చూడవద్దు. నా సోదరులు నా మీద కోపగించారు. వాళ్ల ద్రాక్షా తోటలకు కాపలా కాయుమని నన్ను బలవంత పెట్టారు. అందువల్ల నన్ను గురించి నేను శ్రద్ధ తీసుకోలేక పోయాను .
నా ఆత్మ అంతటితోను నిన్ను ప్రేమిస్తాను! నీ గొర్రెల్ని ఎక్కడ మేపుతావో? మధ్యాహ్నం వాటిని ఎక్కడ పడుకో బెడతావో నాకు చెప్పు. నీతో ఉండటానికి నేను రావాలి లేదా నీ మిత్రుల గొర్రెల కోసం పాటుపడే అద్దెకు తీసుకున్న స్త్రీ అవుతాను!
నా ప్రియులారా, ఫరోరథాలు లాగుతున్న మగ గుర్రాల్ని ఆకర్షించే ఆడ గుర్రం కన్నా నువ్వు నన్ను ఎక్కువ సంతోషపరుస్తున్నావు. ఆ గుర్రాలకు అందమైన అలంకరణలున్నాయి. వాటి ముఖాల పక్కన, వాటి మెడల చుట్టూ