ఇప్పుడు మేల్కొంటాను! నగరమంతా తిరుగుతాను. వీధుల్లోను కూడలి స్థలాల్లోను సంత వీధుల్లోనూ నేను ప్రేమించిన వ్యక్తికోసం చూస్తాను. అతని కోసం చూశాను, కాని అతణ్ణి కనుక్కోలేక పోయాను!
కావలివాళ్లను దాటిన వెంటనే నేను ప్రేమించిన వ్యక్తిని కనుక్కున్నాను! అతణ్ణి పట్టుకున్నాను. అతణ్ణి పోనివ్వలేదు, నా తల్లి ఇంటికి అతణ్ణి తీసుకొని పోయేవరకూ నన్ను కన్న తల్లి గదికి తీసుకొని పోయేవరకూ.
పెద్ద జనం గుంపుతో ఎడారినుండి వస్తున్న ఈ స్త్రీ ఎవరు? కాలుతున్న గోపరసం, సాంబ్రాణి ఇతర సుగంధ ద్రవ్యాల నుండి పొగమబ్బులు వచ్చినట్లుగా వారి వెనుక దుమ్ము లేస్తోంది.