English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Psalms Chapters

Psalms 99 Verses

1 యెహోవాయే రాజు. కనుక రాజ్యాలు భయంతో వణకాలి. కెరూబు [*కెరూబులు దేవునినుండి విశేషమైన దూతలు.] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు. అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
2 సీయోనులో యెహోవా గొప్పవాడు. ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
3 ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక. దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
4 శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు. దేవా నీతిని నీవు చేశావు. యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
5 మన దేవుడైన యెహోవాను స్తుతించండి. ఆయన పవిత్ర పాదపీఠాన్ని [†పాదపీఠం ఇది దేవాలయం అని అర్థము కొవచ్చు.] ఆరాధించండి.
6 మోషే, అహరోనులు దేవుని యాజకులలో కొందరు, మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు. వారు యెహోవాను ప్రార్థించారు. దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
7 ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు. వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు. దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
8 మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు. నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
9 మన దేవుడైన యెహోవాను స్తుతించండి. ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి. మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.
×

Alert

×