నెలవంక నాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి. పౌర్ణమినాడు [*పౌర్ణమినాడు ఇది హెబ్రీయుల నెల మద్య. అనేక ప్రత్యేక సమావేశములు, సెలవు దినములు పౌర్ణమి సమయాన ప్రారంభమయ్యేవి.] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
ఈజిప్టునుండి యోసేపును [†యోసేపు ఇక్కడ యోసేపు కుటుంబము అని అర్థము. అనగా ఇశ్రాయేలీయులు.] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు. ఈజిప్టులో నేను గ్రహించని భాషవిన్నాను.
మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను. తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను. నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”
“నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక [‡ఒడంబడిక అక్షరార్థంగా “సాక్ష్యము.” ఇది దేవునికి ఇశ్రాయేలీయులకు మద్యనున్న ఒప్పందం యొక్క రుజువు. ఒడంబడిక అక్షరార్థంగా “సాక్ష్యము.” ఇది దేవునికి ఇశ్రాయేలీయులకు మద్యనున్న ఒప్పందం యొక్క రుజువు.] నేను మీకు యిస్తాను. ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!