దేవుని స్తుతించండి. ఆయన నామమునకు స్తుతులు పాడండి. ఆయనకు మార్గం సిద్ధపరచండి. ఆరణ్యంలో ఆయన తన రథం మీద వెళ్తాడు. ఆయన పేరు యాహ్. [*యాహ్ ఇది హీబ్రూ భాషలో దేవునికున్న పేర్లలో ఒకటి.] ఆయన నామాన్ని స్తుతించండి.
ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు. దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు.
బాషాను పర్వతమా, నీవేల సీయోను కొండను చిన్న చూపు చూస్తున్నావు? దేవుడు ఆ కొండను ప్రేమిస్తున్నాడు. యెహోవా తాను శాశ్వతంగా అక్కడ నివసించాలని నిర్ణయించుకొన్నాడు.
ఆయన ఎత్తయిన చోట్లకు వెళ్లాడు. ఆయన తన బందీల బృందాలను నడిపించాడు. ఆయన మనుష్యులనుండి అనగా ఆయనను వ్యతిరేకించిన ప్రజలనుండి కూడ కానుకలు తీసుకొన్నాడు [†కానుకలు తీసుకొన్నాడు ‘ఆయన మనుష్యులను కానుకగా స్వీకరించాడు” లేదా “ఆయన మనుష్యులకు కానుకలనిచ్చాడు.” ఇది ప్రాచీన సిరియాక్ మరియు అరమేయిక్ తర్జుమాల ప్రకారం. ఎఫెసి. 4:8 చూడండి.]
దేవుడు తన శత్రువులను ఓడించినట్టు చూపిస్తాడు. [‡దేవుడు … చూపిస్తాడు అక్షరార్థముగా దేవుడు తన శత్రువుల తలలను చితుకగొడతాడు.] దేవుడు తనకు విరోధంగా పోరాడిన వారిని శిక్షిస్తాడు.
ఆ “జంతువులు” నీవు చెప్పినట్లు చేసేలా నీ దండాన్ని ఉపయోగించుము. ఆ దేశాలలోని “ఎద్దులు, ఆవులు” నీకు లోబడేలా చేయుము ఆ రాజ్యాలను యుద్ధంలో నీవు ఓడించావు. ఇప్పుడు వారు నీ వద్దకు వెండి తీసుకొని వచ్చు నట్లు చేయుము.