సముద్రాన్ని [*సముద్రాన్ని ఎర్ర సముద్రం నిర్గ. 14:21.] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు. ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు. [†నదిని దాటి వెళ్లారు యెహోషువ 3:14-17.] అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
(13-14) కనుక నేను నీ ఆలయాలనికి బలులు తీసుకొస్తాను. నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను. నేను నీకు చాలవాగ్దానాలు చేసాను. ఇప్పుడు, నేను వాగ్దానం చేసిన వాటిని నీకు ఇస్తున్నాను.
నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను. నేను నీకు పొట్టేళ్లతో ధూపం [‡ధూపం ఎండుచెట్టుయొక్క రసాన్ని కాల్చినప్పుడు సువాసన పొగవస్తుంది. ఇది దేవునికి కానుకగా ఇవ్వబడింది.] ఇస్తున్నాను. నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను.