1
|
యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు. ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం. |
2
|
ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు. మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు. |
3
|
ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు. అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది. |
4
|
మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు. దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు. |
5
|
ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చేగుణం కలిగి ఉండటం, అతనికి మంచిది. తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది. |
6
|
ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు. ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడుతాడు. |
7
|
మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు. ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు. |
8
|
ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు. అతడు తన శత్రువులను ఓడిస్తాడు. |
9
|
ఆమనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు. అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి. |
10
|
దుష్టులిది చూచి కోపగిస్తారు. వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు. దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు. |
Psalms 112:8 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...