1
|
ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను. యెహోవా, నేను నీకు భజన చేస్తాను. |
2
|
నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను. నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను. యెహోవా నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు? |
3
|
నాయెదుట ఏ విగ్రహాలు ఉంచుకోను. అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను. నేను అలా చేయను! |
4
|
నేను నిజాయితీగా ఉంటాను. నేను దుర్మార్గపు పనులు చేయను. |
5
|
ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను. మనుష్యులు ఇతరులకంటే తామే మంచి వారమని తలుస్తూ అతిశయించడం నేను జరుగ నివ్వను. |
6
|
నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను. ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను. యదార్థ జీవితాలు జీవించే వాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు. |
7
|
అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను. అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను. |
8
|
ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను. దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను. |
Psalms 101:5 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...