ఒక మనిషి మొండివాడై, అతడు చేస్తున్నది తప్పు అని ప్రజలు అతనితో చెప్పినప్పుడల్లా అతనికి మరింత కోపం వస్తే అప్పుడు ఆ మనిషి ఆకస్మాత్తుగా నాశనం చేయబడతాడు. ఆశ ఏమీ ఉండదు.
ఒక మనిషి జ్ఞానమును ప్రేమిస్తే అప్పుడు అతని తండ్రికి చాలా సంతోషం. కాని ఒక మనిషి తన డబ్బును వేశ్యల కోసం వ్యర్థం చేస్తే అప్పుడు అతడు తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకొంటాడు.
ఒక రాజు న్యాయంగా ఉంటే, అప్పుడు ఆ రాజ్యం బలంగా ఉంటుంది. కాని రాజు స్వార్థపరుడై ప్రజల కోసం చేసే పనులన్నిటికి వారు అతనికి డబ్బు చెల్లించాల్సి వస్తే, అప్పుడు ఆ దేశం బలహీనంగా ఉంటుంది.
ఇతరులకంటే మేమే మంచివాళ్లం అనుకొనే మనుష్యులు చాలా చిక్కులు కలిగిస్తారు. వారు మొత్తం పట్టణాలనే గందరగోళం చేయగలరు. కాని జ్ఞానముగల మనుష్యులు శాంతి కలిగిస్తారు.
జ్ఞానముగల మనిషి తెలివి తక్కువ వానితో ఒక సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తే ఆ తెలివి తక్కువ వాడు వాదం పెట్టుకొని మూర్ఖంగా మాట్లాడుతాడు. ఆ ఇద్దరూ ఎన్నటికీ ఏకీభవించరు.
కలిసి పని చేసే ఇద్దరు దొంగలు శత్రువులు. ఒక దొంగ మరో దొంగను బెదిరిస్తాడు. కనుక అతడు సత్యం చేప్పేందుకు న్యాయస్థానంలో బలవంతం చేయబడితే మాట్లాడేందుకు కూడ అతడు ఎంతో భయపడతాడు.