“అభిషేకించబడిన యాజకుడు [*అభిషేకించబడిన యాజకుడు నియమింపబడిన సమయములో సేవ చేయుటకు ఏర్పరచబడ్డ యాజకుడు. ప్రత్యేకమైన నూనె చేత అభిషేకించబడి సేవ చేయుటకు దేవుని చేత ఏర్పరచబడిన వాడు.] పాపం చేసి, ప్రజలమీదికి దోషం రప్పిస్తే, అప్పుడు అతడు తాను చేసిన పాపం నిమిత్తం యెహోవాకు ఒక అర్పణను అర్పించాలి. ఏ దోషమూ లేని ఒక కోడెదూడను అతడు అర్పించాలి. పాపపరిహారార్థ బలిగా ఆ కోడెదూడను అతడు అర్పించాలి.
సన్నిధి గుడార ద్వారం దగ్గర యెహోవా ఎదుటకు అభిషేకించబడిన యాజకుడు ఆ కోడెదూడను తీసుకొనిరావాలి. అతడు కోడెదూడ తల మీద తన చేతులు ఉంచి, యెహోవా ఎదుట దానిని వధించాలి.
యాజకుడు సుగంధద్రవ్వాల ధూప వేదిక మీద ఆ రక్తంలో కొంత పూయాలి, (ఈ ధూపవేదిక సన్నిధిగుడారంలో యెహోవా ఎదుట ఉంటుంది). ఆ కోడెదూడ రక్తాన్ని అంతా దహన బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. ఆ బలిపీఠం సన్నిధి గుడారపు ద్వారం దగ్గర ఉంటుంది.
రెండుమూత్ర పిండాలను, వాటిమీది కొవ్వును, నడుం దగ్గరనున్న కొవ్వును అతడు తీసుకోవాలి. కార్జాన్ని కప్పి ఉన్న కొవ్వును అతడు తీసుకోవాలి. మరియు అతడు మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా తీసుకోవాలి.
బసకు వెలుపల బూడిద పారబోసే ప్రత్యేకమైన చోటుకు ఆ కోడెదూడ కళేబరాన్ని యాజకుడు తీసుకుపోవాలి. అక్కడ కట్టెల మీద నిప్పుతో ఆ కోడెదూడను యాజకుడు కాల్చివేయాలి. బూడిద పారబోసే చోట ఆ కోడెదూడ కాల్చివేయబడుతుంది.
ఆ పాపం విషయమై వారు తెలుసుకొంటే, అప్పుడు ఆ జనాంగం అంతటి నిమిత్తం పాప పరిహారార్థబలిగా ఒక కోడెదూడను అర్పించాలి. సన్నిధి గుడారం ఎదుటికి వారు ఆ కోడెదూడను తీసుకొనిరావాలి.
అప్పుడు యాజకుడు బలిపీఠం కొమ్ములకు కొంత రక్తం పూయాలి. ఆ బలిపీఠం అడుగున యాజకుడు పోయాలి. ఆ బలిపీఠం సన్నిధి గుడారంలో యెహోవా ఎదుట ఉంది. రక్తాన్నంతా దహన బలిపీఠం సన్నిధి గుడార ద్వారం దగ్గర ఉంది.
పాప పరిహారార్థ బలిపశువుకు చేసినట్టే అతడు ఈ కోడెదూడకు కూడా చేయాలి [‡పాప … చేయాలి లేవీ 4:3-12 చూడండి.] ఈ విధంగా యాజకుడు ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాడు. మరియు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు క్షమిస్తాడు.
ఆ మేక కొవ్వు అంతటినీ యాజకుడు బలిపీఠం మీద దహించాలి. సమాధాన బలిలో కొవ్వును దహించినట్లు అతడు దానిని దహించాలి. ఈ విధంగా యాజకుడు అధికారి పాపమునకు ప్రాయశ్చితంచేస్తాడు. మరియు దేవుడు ఆ అధికారిని క్షమిస్తాడు.
అతడు తన పాపాన్ని గుర్తించినట్లయితే ఏదోషం లేని ఒక ఆడ మేకను అతడు తీసుకొని రావాలి. అది ఆ వ్యక్తి అర్పణ. అతడు చేసిన పాపం నిమిత్తం అతడు ఆ మేకను తీసుకొని రావాలి.
తర్వాత సమాధాన బలినుండి కొవ్వు అంతా తీసి వేసినట్టే ఆ మేక కొవ్వు అంతటినీ యాజకుడు తీసివేయాలి. దానిని యెహోవాకు ఇష్టమైన సువాసనగా బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఈ విధంగా ఆ వ్యక్తి పాపాన్ని యాజకుడు తుడిచి వేస్తాడు. మరియు ఆ వ్యక్తిని దేవుడు క్షమిస్తాడు.
సమాధాన బలిలో గొర్రెపిల్ల కొవ్వునంతా తీసివేసినట్టే, ఆ గొర్రెపిల్ల యొక్క కొవ్వు అంతటినీ యాజకుడు తీసివేయాలి. యాజకుడు యెహోవాకు అర్పించే హోమంలా బలిపీఠం మీద ఆ ముక్కలను దహించాలి. ఈ విధంగా, ఆ వ్యక్తి పాపాలను యాజకుడు తుడిచి వేస్తాడు. మరియు దేవుడు ఆ వ్యక్తిని క్షమిస్తాడు.