ఆ వ్యక్తి ఆ పశువు తలమీద తన చేతులు ఉంచాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర ఆ పశువును అతడు వధించాలి. అప్పుడు అహరోను కుమారులైన యాజకులు ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి.
అప్పుడు ఆ కొవ్వును అహరోను కుమారులు బలిపీఠం మీద దహించాలి. దీనిని వారు అగ్నిలో కట్టెలమీద ఉన్న దహనబలి వేస్తారు. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనను యిచ్చే హోమం.
అప్పుడు అతడు సమాధాన బలిలో నుంచి కొంత యెహోవాకు హోమం చేయాలి. కొవ్వు, కొవ్విన తోకమొత్తం, దాని లోపలి అవయవాల మీద చుట్టూ ఉండే కొవ్వు అతడు తీసుకొని రావాలి. వెన్నుపూస నుండి ఉండే తోకను అతడు కోసి వేయాలి.
రెండు మూత్రపిండాలను, వాటిని కప్పి ఉండే కొవ్వును, నడుం దగ్గరనున్న కొవ్వును అతడు అర్పించాలి. కార్జానికి ఉండే కొవ్వుకూడా అతడు అర్పించాలి. మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా అతడు తీయాలి.
రెండు మూతగ్రంథుల్ని, వాటి మీద ఉండే కొవ్వును, ఆ మేక నడుం దగ్గరి కొవ్వును అతడు అర్పణ చేయాలి. కార్జాన్ని కప్పి ఉండే కొవ్వును అతడు అర్పణ చేయాలి. మూత్రపిండాలతో బాటు కార్జాన్ని కూడా అతడు తీయాలి.