నీ తండ్రి యొక్క ఏ భార్యతో (ఆమె నీ తల్లి కానప్పటికీ) నీవు లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు. నీ తండ్రి యొక్క ఏ భార్యతోనైనా నీ తండ్రికి మాత్రమే లైంగిక సంబంధాలు ఉండాలి.
“తల్లి, కూతుళ్లతో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆ తల్లి మనుమరాలితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఈ మనుమరాలు ఆ తల్లి కుమారుని బిడ్డ కావచ్చు, కుమార్తె బిడ్డ కావచ్చు. ఆమె మనుమరాళ్లు ఆమె రక్తసంబంధీకులు. వారితో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం తప్పు.”
“నీ భార్య బతికి ఉండగా, ఆమె సోదరిని నీకు మరో భార్యగా చేసుకోకూడదు. దీని మూలంగా అక్క చెల్లెళ్లు విరోధులవుతారు. నీ భార్య సోదరితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు.”
“మోలెకు కోసం నీ పిల్లల్లో ఎవరినీ అగ్నిగుండం దాటనియ్యకూడదు. ఒకవేళ నీవు అలా చేస్తే, నీ దేవుని నామం అంటే నీకు గౌరవం లేదని నీవు చూపించినట్టే, నేనే యెహోవాను.
“ఏ జంతువుతోను నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. దీని మూలంగా నీవు అపవిత్రం అవుతావు. అలాగే స్త్రీ జంతువుతో లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదు. అది సృష్టి విరుద్ధం!
“అలాంటి వాటిలో దేనిమూలంగాను మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. నేను జనాలను వారి దేశాలనుండి వెళ్లగొట్టి, వారి దేశాలను నేను మీకు యిస్తున్నాను. ఎందుచేతనంటే ఆ ప్రజలు ఆ చెడుకార్యాలు చేసారు. 25 కనుక దేశం మైలపడిపోయింది. అలాంటి కార్యాలతో ఇప్పుడు దేశం రోగభూయిష్టమయింది. మరియు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం ఇప్పుడు వెళ్లగొడుతుంది!
“కనుక మీరు నా ఆజ్ఞలకు, నియమాలకు విధేయులు కావాలి. ఆ భయంకర పాపాలు ఏవీ మీరు చేయకూడదు. ఇశ్రాయేలు పౌరులకు, మీ మధ్య నివసించే ప్రజలకు నియమాలు యివి. 27ఆ దేశంలో మీకు ముందు నివసించిన ప్రజలు ఆ భయంకర సంగతులన్నీ జరిగించారు. అందుచేత దేశం మైలపడింది. 28మీరూ ఈ పనులు చేస్తే, మీరూ ఆ దేశాన్ని మైల చేస్తారు. మరియు మీకంటె ముందు అక్కడ ఉన్న వాళ్ళను వెళ్ళగొట్టినట్లు అది మిమ్మల్ని కూడ వెళ్ళగొడుతుంది. 29ఏ వ్యక్తి గాని ఈ దారుణ పాపాలలో దేనినైనా జరిగిస్తే, ఆ వ్యక్తి తన ప్రజల్లోనుండి వేరు చేయబడాలి. 30ఇతరులు ఆ భయంకర పాపాలు చేశారు. కాని మీరు మాత్రం నా ఆజ్ఞలకు విధేయులు కావాలి. ఆ భయంకర పాపాలేవీ మీరు చేయకూడదు. ఆ భయంకర పాపాలతో మిమ్మల్ని మీరు మైల చేసుకోవద్దు. నేను యెహోవాను, మీ దేవుణ్ణి.”