కోతమిడుతలు విడిచిపెట్టిన దానిని దండు మిడుతలు తినేస్తాయి దండు మిడుతలు విడిచిపెట్టిన దానిని దూకుడు మిడుతలు తినేస్తాయి. దూకుడు మిడుతలు విడిచి పెట్టిన దానిని వినాశ మిడుతలు తినేశాయి!
మద్యపానమత్తులారా మేల్కొని, ఏడ్వండి! ద్రాక్షామద్యం తాగే మీరందరూ ఏడ్వండి. ఎందుకంటే మీ క్రొత్త ద్రాక్షామద్యం అయిపొయింది. ఆ ద్రాక్షామద్యం మరోగుక్కెడు మీకు దొరకదు.
నా రాజ్యం మీద యుద్ధం చేయటానికి, ఒకపెద్ద శక్తిగల రాజ్యం వస్తోంది. వారు లెక్కించ శక్యంకానంత మంది సైనికులు ఉన్నారు. ఆమిడుతలు (శత్రుసైనికులు) మిమ్మల్ని నిలువునా చీల్చివేయగలవు! అది వారికి సింహపుకోరలు ఉన్నట్టుగా ఉంట్టుంది.
నా ద్రాక్షావల్లుల నుండి ద్రాక్షాపళ్ళు అన్నింటినీ ఆ “మిడుతలు”తినేస్తాయి! అవి నా అంజూరపు చెట్లను నాశనం చేస్తాయి. మిడుతలు నా చె ట్లబెరడును తినేస్తాయి. కొమ్మలు తెల్లబారి పోతాయి. చెట్లు నాశనం చేయబడతాయి.
యాజకులారా, మీ విచార సూచక వస్త్రాలు ధరించి గట్టిగా ఏడ్వండి. బలిపీఠపు సేవకులారా, నా దేవుని సేవకులారా, మీరు మీ విచారసూచక వస్త్రాలతోనే నిద్రపోతారు. ఎందుకంటే దేవుని ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇకమీదట ఉండవు. మా వేశ పరచు నీ దేవుడైన సమయం ఉ యెహోవా ఆలయానికి వారిని తీసుకొని వచ్చి యెహోవాకు ప్రార్థించండి.
ఉపవాసం ఉండాల్సిన ఒక ప్రత్యేక సమయం ఉంటుందని ప్రజలతో చెప్పు. ప్రత్యేకమైన ఒక సమావేశం కోసర ప్రజల్నిపిలువుము. దేశంలో నివసిస్తున్న నాయకులను, ప్రజలందరిని సమావేశ పరచు. నీదేవుడైన యెహోవా ఆలయాని కివారిని తీసుకొనివచ్చి యెహోవాకు ప్రార్థించండి.