1
|
మనుష్యులకు వెండి లభిర చే గనులు ఉన్నాయి. మనుష్యులు బంగారాన్ని కరిగించి, దానిని శుభ్రం చేసే స్థలాలు ఉన్నాయి. |
2
|
మనుష్యలు భూమినుండి ఇనుమును తవ్వుతారు. బండల నుండి రాగి కరిగించబడుతుంది. |
3
|
పనివాళ్లు గుహల్లోకి దీపం తీసుకొని వస్తారు. ఆ గుహల్లో లోపలికి వారు వెదుకుతారు. లోపలిచీకటిలో బండల కోసం వారు వెదుకుతారు. |
4
|
మనుష్యులు నివసించే చోటికి దూరంగా పనివాళ్లు గోతులు తవ్వుతారు. మరి ఏ మనిషీ కూడ గోతులను ఎన్నడూ తాకలేదు. పనివాడు లోతైన ఆ గోతుల్లోనికి తాళ్లతో దిగేటప్పుడు అతడు యితరులకు చాలా దూరంలో ఉంటాడు. |
5
|
భూమిపై నుండి ఆహారం వస్తుంది. కానీ భూమి కింద, వస్తువులను మంట మార్చివేసినట్టు, అది మార్చివేయబడుతుంది. |
6
|
నేలక్రింద బండలలో నీల రత్నాలు లభ్యమవుతాయి. నేల కింద మట్టిలో బంగారం ఉంది. |
7
|
ఆహారం కోసం జంతువులను తినే పక్షులకు భూమికింద మార్గాలు తెలియవు. డేగ కూడా ఈ మార్గం చూడదు. |
8
|
కృర మృగాలు ఈ మార్గంలో నడవలేదు. సింహాలు ఈ మార్గంలో పయనించలేదు. |
9
|
పనివాళ్లు కఠిన శిలలను తవ్వుతారు. ఆ పనివాళ్లు పర్వతాలను తవ్వి, వాటిని ఖాళీ చేస్తారు. |
10
|
పనివాళ్లు బండల్లోనుంచి సొరంగాలు తవ్వుతారు. బండల్లోని ఐశ్వర్యాలు అన్నింటినీ వాళ్లు చూస్తారు. |
11
|
నీళ్లు ప్రవహించకుండా నిలిపేందుకు పనివాళ్లు ఆన కట్టలు కడతారు. దాగి ఉన్న వాటిని వారు వెలుగు లోనికి తీసికొని వస్తారు. |
12
|
“అయితే మనిషికి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? గ్రహించటం ఎలా అనేది నేర్చుకొనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి? |
13
|
జ్ఞానం చాలా అమూల్యమయిందని మనుష్యులు గ్రహించరు. భూమి మీద నివసించే మనుష్యులకు జ్ఞానం లేదు. |
14
|
‘జ్ఞానం నాలో లేదు’ అని అగాధ మహాసముద్రం అంటుంది. ‘జ్ఞానం నా దగ్గరా లేదు’ అని సముద్రం అంటుంది. |
15
|
అతి ఖరీదైన బంగారంతో జ్ఞానం కొనలేము. జ్ఞానం ఖరీదు వెండితో లెక్క కట్టబడజాలదు. |
16
|
ఓఫీరు బంగారంతో గాని, విలువైన గోమేధికంతోగాని, నీలంతో గాని, అది కొనబడేది కాదు. |
17
|
బంగారం, స్ఫటికం కంటే జ్ఞానం విలువైనది. బంగారంతో చేయబడిన చాలా ఖరీదైన నగలతో జ్ఞానం కొనబడజాలదు. |
18
|
జ్ఞానం పగడాలకంటె, పచ్చలకంటె విలువగలది. జ్ఞానం కెంపువకంటె ఖరీదైనది. |
19
|
ఇథియోపియా (కూషు)దేశపు పుష్యరాగం జ్ఞానం కంటె విలువైనది కాదు. మేలిమి బంగారంతో మీరు జ్ఞానమును కొనలేరు. |
20
|
“అలాగైతే జ్ఞానం కనుగొనాలంటే మనం ఎక్కడికి వెళ్లాలి? అవగాహన చేసికోవటం నేర్చుకోనేందుకు మనం ఎక్కడికి వెళ్లాలి? |
21
|
భూమి మీద ప్రతి మనిషి నుండీ జ్ఞానం దాచబడింది. ఎత్తుగా ఆకాశంలో ఉన్న పక్షులు కూడా జ్ఞానాన్ని చూడలేవు. |
22
|
‘మేము జ్ఞానమును గూర్చిన ప్రచారం మాత్రమే విన్నాం’ అని మరణం, నాశనం చెబుతాయి. |
23
|
“కానీ జ్ఞానానికి మార్గం దేవునికి మాత్రమే తెలుసు. జ్ఞానం ఎక్కడ నివసిస్తుందో దేవునికి తెలుసు. |
24
|
భూదిగంతాలకు గల మొత్తం మార్గాన్ని దేవుడు చూస్తాడు గనుక ఆయనకు జ్ఞానం తెలుసు. ఆకాశాల కింద ఉన్న సర్వాన్ని దేవుడే చూస్తాడు. |
25
|
గాలికి దాని శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు, మహా సముద్రాలు ఎంత పెద్దవిగా ఉండాలో ఆయన నిర్ణయించినప్పుడు, |
26
|
వర్షాన్ని ఎక్కడ కురిపించాలి, ఉరుములు తుఫానులు ఎటువైపుగా వెళ్లాలి అని దేవుడు నిర్ణయించి నప్పుడు |
27
|
అది దేవుడు జ్ఞానాన్ని చూచిన సమయం, జ్ఞానం యొక్క విలువ ఎంతో చూచేందుకు దానిని పరీ క్షించిన సమయం అవుతుంది. జ్ఞానాన్ని దేవుడు నిర్ధారణ చేశాడు. |
28
|
“యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించటం జ్ఞానం అవుతుంది. చెడు సంగతుల నుండి తప్పుకోవటం అవగాహన అవుతుంది” అని దేవుడు ప్రజలతో చెప్పాడు. |
Job 28:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...