1
|
అప్పుడు యోబు జోఫరుకు ఇలా జవాబు ఇచ్చాడు: |
2
|
“సందేహము లేకుండ, మీరు మాత్రమే జ్ఞానం గల వాళ్లని మీరు తలస్తారు. మీరు చనిపోయినప్పుడు మీతో బాటు జ్ఞానం గతిస్తుందని మీరు తలస్తారు. |
3
|
అయితే మీరు ఎంత జ్ఞాలంగలవాళ్లో నేనూ అంత జ్ఞానంగలవాడిని. నేను మీకంటే తక్కువేమి కాదు. ఇది సత్యం అని ఇతరులకు కూడా తెలుసు. |
4
|
“ఇప్పుడు నా స్నేహితులు నన్ను చూసి నవ్వుతారు. వారిలా అంటారు: ‘వీడు దేవుణ్ణి ప్రార్థించాడు. వీనికి ఆయన జవాబు ఇచ్చాడు.’ “కానీ నేను మంచివాణ్ణి, నిర్దోషిని. అయినప్పటికీ ఇంకా నన్ను చూసి నా స్నేహితులు నవ్వుతూనే ఉన్నారు. |
5
|
కష్టాలు లేని మనుష్యులు కష్టాలు ఉన్న వాళ్లను హేళన చేస్తారు. అలార టి వాళ్లు పడిపోతున్న వాళ్లను కొట్టేస్తారు |
6
|
దొంగల గుడారాలకు ఇబ్బంది లేదు. దేవునికి కోపం రప్పించే వాళ్లు శాంతిగా జీవిస్తారు. వారి ఒకే దేవుడు వారి స్వంత బలమే. |
7
|
“ అయితే జంతువుల్ని అడగండి, అవి మీకు నేర్పిస్తాయి. లేక ఆకాశ పక్షుల్ని అడగండి, అవి మీకు నేర్పిస్తాయి. |
8
|
లేక భూమితో మాట్లాడండి, అది మీకు నేర్పిస్తుంది. లేక సముద్రపు చేపలను వాటి జ్ఞానం గూర్చి మీతో చెప్పనివ్వండి. |
9
|
వాటిని యెహోవా సృష్టించాడని ప్రతి ఒక్కరికీ తెలుసు. |
10
|
బతికి ఉన్న ప్రతి జంతువూ శ్వాస పీల్చే ప్రతి మనిషీ దేవుని శక్తి క్రిందనే. |
11
|
భోజనం రుచి చూడడం నాలుకకు ఎంత ఆనందమో చెవులు అని వినే మాటలను పరీక్షించవా: |
12
|
ముసలి వాళ్లకు కూడా జ్ఞానం ఉంది. దీర్షాయుష్షు అవగాహన కలిగిస్తుంది. అని మేము అన్నాము. |
13
|
జ్ఞానం, బలం దేవునికి చెందుతాయి. మంచి సలహా మరియు గ్రహింపు ఆయనవే. |
14
|
ఒక వేళ దేవుడు దేనినైనా పడగొడితే మనుష్యులు దాన్ని తిరిగి నిర్మించలేరు. ఒక వేళ దేవుడు ఒక మనిషిని చెరసాలలో పెడితే మనుష్యులు అతనిని విడుదల చేయలేరు. |
15
|
ఒక వేళ దేవుడు గాని వర్షాన్ని ఆపివేస్తే భూమి ఎండి పోతుంది. ఒక వేళ దేవుడు గాని వర్షాన్నిరానిస్తే అది భూమిని వరదతో నింపివేస్తుంది. |
16
|
దేవుడు బలవంతుడు, ఆయన ఎల్లప్పుడూ గెలుస్తాడు. మోసపోయిన వాడు మోసం చేసిన వారూ ఇద్దరూ దేవునికి చెందిన వారే. |
17
|
రాజుల జ్ఞానమును దేవుడు తీసి వేస్తాడు. నాయకులు వెర్రిగా వ్రవర్తించేటట్టు చేస్తాడు. |
18
|
రాజులు వారి బందీలకు గొలుసులు వేస్తారు. కాని దేవుడు వాటిని తీసివేస్తాడు. అప్పుడు దేవుడు ఆ రాజుల మీద నడికట్టు వేస్తాడు. |
19
|
తన వంశాన్ననుసరించి రక్షణ ఉందనుకొనే యాజకుల బలాన్ని దేవుడు అణచి, వాళ్లను క్రిందికి దిగజారేటట్లు చేస్తాడు. |
20
|
నమ్మకమైన సలహాదారులను దేవుడు నిశ్శబ్దం చేస్తాడు. వృద్ధుల జ్ఞానమును ఆయన తీసివేస్తాడు. |
21
|
నాయకులను అప్రముఖులనుగా చేస్తాడు. పాలకుల బలాన్ని ఆయన తీసివేస్తాడు. |
22
|
లోతైన అంధకారంలో నుండి రహస్య సత్యాలను దేవుడు చూపిస్తాడు. మరణం లాంటి చీకటి గల స్థలాలలోనికి ఆయన వెలుగు పంపిస్తాడు. |
23
|
దేవుడు రాజ్యాలను పెద్దవిగా, శక్తిగలవిగా విస్తరింపజేస్తాడు. అప్పుడు ఆయన వాటిని నాశనం చేస్తాడు. ఆయన రాజ్యాలను పెద్దనిగా పెరగనిస్తాడు. అప్పుడు ఆ రాజ్యాల్లోని ప్రజలను ఆయన చెదర గొడతాడు. |
24
|
భూలోక నాయకులను వెర్రివార్ని గాను అర్థం చేసుకోలేని వార్ని గాను దేవుడు చేస్తాడు. మార్గం లేని అరణ్యంలో సంచరించేందుకు ఆయన వారిని పంపిస్తాడు. |
25
|
ఆ నాయకులు చీకటిలో ముందుకు సాగుతారు. వారికి ఏ వెలుగూ లేదు. వారు తాగుబోతుల్లా నడిచేటట్టు దేవుడు వారిని చేస్తాడు.” |
Job 12:22 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...