1
|
ఇశ్రాయేలూ, నీవు పడిపోయి దేవునికి విరోధముగా పాపము చేశావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా వద్దకు తిరిగిరమ్ము. |
2
|
నీవు చెప్పబోయే విషయాల గురించి ఆలోచించుము. యెహోవా వద్దకు తిరిగిరిమ్ము. ఆయనతో ఇలాగున చెప్పుము, “మా పాపాన్ని తీసివేయుము. మా మంచి పనులను అంగీకరించుము. మా పెదవులనుండి స్తుతిని సమర్పిస్తాము. |
3
|
“అష్షూరు మమ్మల్ని కాపాడదు. మేమిక యుద్ధ గుర్రాల పైన స్వారీ చేయుము. మేము మా స్వహస్తాలతో చేసిన విగ్రహాలను ఇంకెప్పుడూ మరల ‘ఇది మా దేవుడు’ అని అనము. ఎందుకంటే, అనాధుల పట్ల జాలి చూపేది నువ్వొక్కడివే.” |
4
|
అందుకు యెహోవా ఇలా అంటాడు: “ నా కోపం చల్లారింది, కనుక, నన్ను వీడి పోయినందుకు నేను వాళ్లని క్షమిస్తాను. నేను వాళ్లని ధారాళంగా ప్రేమిస్తాను. |
5
|
నేను ఇశ్రాయేలీయులకు మంచువలెవుంటాను. ఇశ్రాయేలు తామర పుష్పంలాగ వికసిస్తాడు. అతడు లెబానోను, దేవదారు వృక్షంలాగా వేరుతన్ని దృఢంగా నిలుస్తాడు. |
6
|
అతని శాఖలు విస్తరిస్తాయి, అతను అందమైన దేవదారు వృక్షంలాగ ఉంటాడు. అతను లెబానోనులోని దేవదారు చెట్లు వెలువరించే సువాసనలాగ ఉంటాడు. |
7
|
ఇశ్రాయేలీయులు మరల నా పరిరక్షణలో జీవిస్తారు. గోధుమ కంకుల్లాగ పెరుగుతారు. ద్రాక్షా తీగల్లాగ పుష్పించి ఫలిస్తారు. వారు లెబానోను ద్రాక్షారసం వలె ఉంటారు.” |
8
|
“ఎఫ్రాయిమూ, విగ్రహాలతో ఇక నీకెంత మాత్రమూ పనిలేదు. నీ ప్రార్థనలు ఆలకించేది నేనే నిన్ను కాపాడేది నేనే. నేను నిరంతరం పచ్చగానుండే మీ ఫలము నానుండి వస్తుంది.” |
9
|
వివేకవంతుడు ఈ విషయాలు గ్రహిస్తాడు. చురుకైనవాడు ఈ విషయాలు నేర్చుకోవాలి. యెహోవా మార్గాలు సరైనవి. మంచివాళ్లు వాటిద్వారా జీవిస్తారు. పాపులు వాళ్లకు వాళ్లే చనిపోతారు. |
Hosea 14:9 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...