యెహోవా యూదా వారిని, యెరూషలేము వారిని బయటకు పంపివేసినప్పుడు యెహోజాదాకు కూడ గత్యంతరం లేక వారితో ఇల్లు వదలి పోవలసి వచ్చింది. ఆ ప్రజలు ఒక కొత్త రాజ్యంలో బందీలయ్యారు. యూదా వారిని, యెరూషలేము వారిని బందీలు చేయటానికి యెహోవా నెబకద్నెజరును వినియోగించాడు.
ఎల్కానా మరో కుమారుడు జోఫై. [*ఎల్కానా … జోఫై ఇక్కడ మూల గ్రంథం విశదంగా లేదు. హెబ్రీలో ఇలా వుంది, ఎల్కానా, అతని కొడుకు ఎల్కానా. అతని కుమారుడు జోఫై.] జోఫై కుమారుడు నహతు.
వీరు పవిత్ర గుడారంలో దేవునికి స్తుతి గీతాలు ఆలపించేవారు. పవిత్ర గుడారమే సమావేశ గుడారమని పిలవబడేది. సొలొమోను యెరూషలేములో యెహోవాకు ఆలయాన్ని నిర్మించేవరకు ఈ గాయకులు సంగీత సేవ చేసారు. వారికి నిర్దేశించిన నియమావళిని వారు అనుసరించి పని చేసారు.
సంగీత సేవ చేసిన వారు, వారి కుమారుల పేర్ల వివరాలు ఇలా వున్నాయి: కహతీయుల సంతతి వారు: హేమాను గాయకుడు. హేమాను తండ్రి పేరు యోవేలు. యోవేలు తండ్రి పేరు సమూయేలు.
మెరారి సంతతి వారు హేమానుకు, ఆసాపుకు బంధువులు. వారు హేమానుకు ఎడమ పక్కన నిలబడి స్తోత్రగీతాలు పాడేవారు. ఏతాను తండ్రి పేరు కీషీ. కీషీ తండ్రి అబ్దీ. అబ్దీ తండ్రి మల్లూకు.
హేమాను, ఆసాపుల సోదరులు లేవి వంశంలోని వారే. లేవి సంతతినంతా లేవీయులని పిలుస్తారు. లేవీయులు యెహోవా పవిత్ర గుడారంలో సేవా కార్యక్రమ నిర్వహణకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వారు. పవిత్ర గుడారమనగా దేవుని ఇల్లు.
కాని అహరోను, అతని సంతతి వారు మాత్రమే బలిపీఠంపై దహనబలులు అర్పించేందుకు అనుమతించబడ్డారు. వారికి ధూపపీఠం మీద ధూపంవేసే హక్కు కూడ వుంది. ఆలయపు అతిపరిశుద్ధ స్థలంలోని పనంతా వారే చేసేవారు. ఇశ్రాయేలు పాపపరిహారార్థం, ప్రజల పాపాలకు విచార సూచకంగా వారు ఆలయంలో ప్రాయశ్చిత్త కార్యాలు నిర్వహించేవారు. మోషే నిర్దేశించిన నియమాలను, నిబంధనలను వారు తప్పక పాటించేవారు. మోషే దేవుని సేవకుడు.
అహరోను సంతతి వారు నివసించిన ప్రదేశాలు: వారికివ్వబడిన భూములలో స్థావరాలు ఏర్పరచుకొని వారు నివసించారు. లేవీయులకియ్యబడిన భూముల్లో కహాతీయులకు మొదటి భాగం ఇవ్వబడింది.
అహరోను సంతతివారికి హెబ్రోను నగరం ఇవ్వబడింది. హెబ్రోను ఆశ్రయపురం [†ఆశ్రయపురం ఇశ్రాయేలీయుడు ఎవరినైనా చంపినప్పుడు కోపగించిన తన బంధువుల నుండి తనను తాను కాపాడుకొనేందుకు పారిపోయి సురక్షితంగా దాగివుండే నగరం. యెహోషువ 20:1-9 చూడండి.] వారికింకా లిబ్నా, యత్తీరు, ఎష్టెమో,
బెన్యామీను సంతతి వారికి గిబియోను, గెబ, అల్లెమెతు, అనాతోతు నగరాలు ఇవ్వబడ్డాయి. ఈ నగరాలతో పాటు ఆ ప్రాంతాలలోని పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి. పదమూడు నగరాలు కహాతీయుల కుటుంబాల వారికియ్యబడ్డాయి.
గెర్షోను సంతతి వారైన వంశాల వారికి పదమూడు నగరాలు ఇవ్వబడ్డాయి. వారికి ఈ నగరాలు ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషాను ప్రాంతాలలో నివసించే కొందరికి మనష్షే వారినుండి సంక్రమించాయి.
మెరారీ సంతతి వారైన వంశాల వారికి పన్నెండు నగరాలు వచ్చాయి. వారికి ఈ నగరాలు రూబేను, గాదు, జెబూలూను కుటుంబాల వారినుండి వచ్చాయి. వారికి ఆ నగరాలు చీట్లువేసి ఇచ్చారు.
గెర్షోను ప్రజలకు బాషాను ప్రాంతంలోని గోలాను పట్టణం, మనష్షే సగం వంశం వారి నుండి అష్తారోతు పట్టణం ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాలకు దగ్గరలో వున్న పొలాలు కూడ వారికి ఇవ్వబడ్డాయి.
(72-73) గెర్షోను కుటుంబాల వారికి ఇశ్శాఖారు వంశం నుంచి కెదెషు, దాబెరతు, రామోతు మరియు ఆనేము అను పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల సమీపంలో గల భూములు కూడ వారికివ్వబడ్డాయి.
మిగిలిన లేవీయులైన మెరారీయులకు జెబూలూను వంశం నుండి యొక్నెయాము, కర్తా, రిమ్మోను మరియు తాబోరు పట్టణాలు లభించాయి. ఆ పట్టణాల దగ్గరలో గల భూములు కూడ వారికి ఇవ్వబడ్డాయి.
(78-79) మెరారీయులు రూబేను వంశం నుండి అరణ్య ప్రాంతంలోని బేసెరు, యహజా, కెదేమోతు మరియు మేఫాతు పట్టణాలను పొందారు. రూబేను వంశస్థులు యొర్దాను నదికి తూర్పున, యెరికో నగరానికి తూర్పున నివసించారు. మెరారీయులకు పట్టణాలతో పాటు పరిసర భూములు కూడ ఇవ్వబడ్డాయి.
(80-81) మెరారీయులు ఇంకను గాదు వంశం నుండి గిలాదు నందలి రామోతు, మహనయీము, హెష్బోను మరియు యాజెరు పట్టణాలను పొందారు. వారికి పట్టణాలతో పాటు సమీప పొలాలు కూడ ఇవ్వబడ్డాయి.