Indian Language Bible Word Collections
Proverbs 7:18
Proverbs Chapters
Proverbs 7 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Assamese
Books
Old Testament
New Testament
Proverbs Chapters
Proverbs 7 Verses
1
|
నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచు కొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. |
2
|
నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు. |
3
|
నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము |
4
|
జ్ఞానముతోనీవు నాకు అక్కవనియు తెలివితోనీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. |
5
|
అవి నీవు జారస్త్రీయొద్దకు పోకుండను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును. |
6
|
నా యింటి కిటికీలోనుండి నా అల్లిక కిటికీలోనుండి నేను పారజూడగా జ్ఞానములేనివారి మధ్యను |
7
|
¸°వనుల మధ్యను బుద్ధిలేని పడుచువాడొకడు నాకు కనబడెను. |
8
|
సందెవేళ ప్రొద్దు గ్రుంకినతరువాత చిమ్మచీకటిగల రాత్రివేళ |
9
|
వాడు జారస్త్రీ సందుదగ్గరనున్న వీధిలో తిరుగు చుండెను దాని యింటిమార్గమున నడుచుచుండెను. |
10
|
అంతట వేశ్యావేషము వేసికొనిన కపటముగల స్త్రీ ఒకతె వానిని ఎదుర్కొన వచ్చెను. |
11
|
అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని యింట నిలువవు. |
12
|
ఒకప్పుడు ఇంటియెదుటను ఒకప్పుడు సంతవీధులలోను అది యుండును. ప్రతి సందుదగ్గరను అది పొంచియుండును. |
13
|
అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను |
14
|
సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను |
15
|
కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవేకనబడితివి |
16
|
నా మంచముమీద రత్నకంబళ్లను ఐగుప్తునుండి వచ్చు విచిత్రపుపనిగల నారదుప్పట్లను నేను పరచియున్నాను. |
17
|
నా పరుపుమీద బోళము అగరు కారపుచెక్క చల్లి యున్నాను. |
18
|
ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. |
19
|
పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు |
20
|
అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు అనెను |
21
|
అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను. |
22
|
వెంటనే పశువు వధకు పోవునట్లును పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును |
23
|
తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను. |
24
|
నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి |
25
|
జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము. |
26
|
అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది |
27
|
దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. |